Corona Red Alert: మళ్లీ నియంత్రించలేనిదిగా మారుతోన్న కరోనా.. రెడ్ అలర్ట్?
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కేసుల వేగం భయానకంగా ఉంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోంది

Corona 11zon (1)
Corona Red Alert: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కేసుల వేగం భయానకంగా ఉంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోండగా.. ప్రజలు మాత్రం ఇంకా అప్రమత్తం కాలేదని అధికారులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఓమిక్రాన్ ఎలా ఆగిపోతుంది? కరోనా ఎలా తగ్గుతుంది అనేది ప్రశ్న.
కొత్త సంవత్సరం మొదటి రోజు:
ఢిల్లీలో కొత్త సంవత్సరం వచ్చిన మొదటి రోజే 2700కేసులు దాటాయి. డిసెంబర్ 31వ తేదీ నుంచి 51 శాతం ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 21వ తేదీ తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే. కరోనా సంక్రమణ రేటు 64కి పెరిగింది. అంటే ఇప్పుడు ప్రతి 100 మందిలో 64 మందికి కరోనా సోకుతోంది.
ఢిల్లీలో ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ ప్రకటించగా.. ఇన్ఫెక్షన్ రేటు 5 శాతం దాటితే లేదా రోజూ 16 వేల కేసులు నమోదయితే, వెంటనే రెడ్ అలర్ట్ జారీ చేయనున్నారు.
ఐదు జిల్లాల్లో కరోనా నిబంధనలను కఠినతరం:
గురుగ్రామ్, ఫరీదాబాద్, పంచకుల, అంబాలా మరియు సోనిపట్‌లలో నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
సినిమా హాళ్లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు మూతపడ్డాయి
50 శాతం ఉద్యోగులను మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించాలని ఆదేశించారు.
ఆర్ధిక రాజధాని ముంబైలో..
జనవరి 1న ముంబైలో 6347 కరోనా కేసులు నమోదయ్యాయి.
ముంబైలో కరోనా కేసులు 12 శాతం పెరిగాయి
అదే సమయంలో ముంబైలోని 157 భవనాలకు సీల్ వేయాల్సి వచ్చింది
మహారాష్ట్రలో మొత్తం 9170 కేసులు నమోదయ్యాయి.
ఇతర రాష్ట్రాల పరిస్థితి:
గుజరాత్‌లో 1069 కేసులు
ఉత్తరాఖండ్‌లో 118 కొత్త కేసులు
మధ్యప్రదేశ్‌లో 124 కరోనా కేసులు నమోదయ్యాయి
కేరళ, మిజోరంలలో కూడా కేసులు పెరిగాయి.
కరోనా కొత్త కేసులకు ఒమిక్రాన్ వేరియంట్ కూడా కారణం కావొచ్చిని అంటున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత, Omicron పరీక్షిస్తోండగా.. ఈలోపే వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని అంటున్నారు.