వంట మాస్టర్ కు కరోనా…. పెళ్లి వారు క్వారంటైన్ కి

వంట మాస్టర్ కు కరోనా…. పెళ్లి వారు క్వారంటైన్ కి

Updated On : March 17, 2021 / 5:58 PM IST

పెళ్లిలో వంట చేయటానికి వచ్చిన  వంట మాస్టర్ కు కరోనా పాజిటివ్ తేలటంతో ఆపెళ్లికి వచ్చినవారందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. కర్ణాటకలోని  తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని హెరూరి లో కొద్దిరోజుల క్రితం వివాహం జరిగింది. అప్పటికే లాక్ డౌన్ ఉండటంతో ఇంటివద్దనే పెళ్లి నిరాడంబరం గా నిర్వహించారు.

red zone

అయితే పెళ్లికి వంట చేయటానికి వచ్చిన వంట మాస్టర్ కు జూన్ 14న జ్వరం వచ్చింది. ఆయనకు  కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్  అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పెళ్లి వారి వివరాలు తీసుకుని నూతన వధూవరులతో పాటు సుమారు 56 మందిని క్వారంటైన్ కు తరలించారు. ఆ గ్రామాన్ని రెడ్ జోన్ చేసి, శానిటైజేషన్ చేశారు.

Read: కరోనా వేళ : రూ.35 లక్షల అప్పు..ఆరుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య