కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు.. 80% మందిలో గుండె సమస్యలు- అధ్యయనం

కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అస్తవ్యస్తం చేస్తుంది. ఇప్పటివరకు, ప్రపంచవ్యాప్తంగా 16.7 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అధిక రిస్క్ వర్గానికి లేదా ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమైనదిగా మారింది. ఈ వైరస్ శ్వాసకోశ శరీరంపై దాడి చేస్తుంది. నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. అలాగే, గుండె, జీర్ణవ్యవస్థ, బ్రెయిన్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.
80 శాతం కేసుల్లో నష్టం:
అయితే దీని నుంచి కోలుకుంటున్నవారి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, మనిషిలో కోవిడ్ -19 దీర్ఘకాలిక ఫలితాలు మరింత ప్రమాదకరమని కొత్త పరిశోధనలో తేలింది. ఇందులో 80 శాతం కేసులలో రోగులకు తీవ్రమైన గుండె సమస్యలు, నష్టం ఉన్నట్లు నివేదించబడింది.
జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జామా) తన అధ్యయనంలో ఏప్రిల్ – జూన్ మధ్య జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి 100 మంది కోవిడ్ రోగుల MRI ఫలితాలను పరిశీలించింది. ఈ రోగులందరూ 40నుంచి 50ఏళ్ల మధ్య ఆరోగ్యంగా ఉన్నారు కరోనా సోకిన తర్వాత కోలుకున్నారు.
అయితే ఈ 100 మందిలో 67 మంది రోగులకు మితమైన లక్షణాలు ఉండి ఇంట్లోనే కోలుకోగా, మిగిలిన 23 మంది ఆసుపత్రిలో చేరారు. గుండెపై కోవిడ్ -19 ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి పరిశోధకులు ఎంఆర్‌ఐ, రక్త పరీక్షలు మరియు గుండె కణజాల బయాప్సీలతో సహా పలు రకాల సాధనాలను ఉపయోగించారు. పరిశీలనను 50 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లు మరియు 57 మంది ప్రమాదం ఉన్న వారితో పోల్చారు.
కోలుకున్న 100 మంది రోగులలో 78 మందికి గుండె దెబ్బతినినట్లుగా గుర్తించారు. పరిశోధకుడు క్లైడ్ డబ్ల్యూ, యాన్సీ, ఎండి, మరియు గ్రెగ్ సి ప్రకారం, ఇంత ఎక్కువ శాతం మంది ప్రజలు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యమైన అవయవాలకు ప్రత్యేకంగా సంబంధం ఏమిటో తెలియట్లేదు.
అధ్యయనం నుంచి వచ్చిన ప్రాథమిక ఫలితాలు ప్రకారం.. వైరస్ దీర్ఘకాలిక పరిణామాల గురించి ఇంకా చాలా తక్కువగా అందరికీ తెలుసునని అన్నారు. గుండె ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలు తాత్కాలికంగా ఉన్నాయా లేదా ఎక్కువ కాలం కొనసాగుతున్నాయా? అనే విషయాలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.