దేశంలో కరోనా కేసులు పెరిగే కొద్దీ వెంటిలేటర్ల కొరత!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్(COVID-19) మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా కేసులు సంఖ్య 90దాటింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 400దాటింది. అయితే భారతదేశంలో ఉన్న 130కోట్లు కాగా,దేశంలోని వెంటిలేటర్ల సంఖ్య కేవలం 40వేలు మాత్రమే.
దేశంలో కరోనా ఇన్పెక్షన్ ఎక్కువైతే వెంటిలేటర్లు సరిపోవని నిపుణులు తెలిపారు. ఇప్పటివరకు 5 శాతం రోగులు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో ఇంటెన్పివ్ కేర్ యూనిట్ల(ICU)లో ఉన్నారు.
ఈ వైరస్ ఇతర దేశాలలో వ్యాప్తి చెందిన విధంగా మన దేశంలో కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో మరణాల సంఖ్య 8 కి చేరుకుంది. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలలో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ అనేది మనుషుల ఊపిరితిత్తుల పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ సంబంధిత పని తీరును దెబ్బ తీస్తుంది. అందువల్ల రోగులకు గాలిని అందించటం కోసం వెంటిలేటర్లు అవసరమవుతాన్నాయి.
దేశ వ్యాప్తంగా 40 వేల వెంటిలేటర్లు ఉండవచ్చునని ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ ప్రెసిడెంట్ డాక్టర్ ధ్రువ చౌదరి అన్నారు. ఇవి ఎక్కువగా ప్రభుత్వ హస్పిటల్స్, ప్రైవేట్ హస్పిటల్స్, మైట్రోపాలిటిన్ సిటీలలో ఉన్నాయి. వెంటిలేటర్లు అందుబాటులో లేకపోతే వైరస్ మరణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. జనతా కర్ప్యూ, నిర్భందనం వంటి చర్యల వల్ల రోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని రోహ్తక్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెడ్ డాక్టర్ చౌదరి అన్నారు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లలోను అధిక మరణాలు సంభవించటానికి తగ్గినన్ని ఐసీయూలు లేకపోవటమే కొంతవరకు కారణమని తెలుస్తుంది.
భారత్ లో వెంటిలేటర్ల సంఖ్య పెంచాలన్న పరిశ్రమ ప్రతిపాదనను శనివారం శాస్త్రవేత్తల బృందం ఆమోదించింది. కోవిడ్ 19 వ్యాప్తి తరువాత వెంటిలేటర్లను 1200 యూనిట్లకు కొనుగోలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లావ్ అగర్వాల్ ఆదివారం తెలిపారు. ఒక్కో వెంటిలేటర్ ధర సుమారు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. హస్పిటల్ పరిమాణాన్ని బట్టి ఐసియు యూనిట్ల పరిమాణాలలో మార్పులు ఉంటాయి. దేశంలో ప్రతి 1,457 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన విధంగా 1: 1,000 నిష్పత్తిలో ఉండాలి.