బెస్ట్ ఇంటర్నెట్, నిత్యావసర సరుకులు హోమ్ డెలీవరీ చేస్తున్న కేరళ గవర్నమెంట్

WHO కరోనాను మహమ్మారి అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో రాకపోకలు నిలిపేస్తుంటే కేరళ హోం డెలీవరీ చేసేందుకే సిద్ధమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే దిశగా అత్యవసర జాగ్రత్తలు తీసుకుంటుంది. (Corona మ్యాప్ షేర్ చేస్తున్నారా.. హ్యాకర్ల ట్రాప్‌లో పడినట్లే)
17కరోనా పాజిటివ్ కేసులతో సతమతమవుతోన్న కేరళ.. ఇంటికే సర్వీసులు అందిస్తుంది. ఆహార పదార్థాలు, నిత్యావసరాలను స్థానిక పంచాయతీ పర్యవేక్షణలో ఇంటింటికీ డెలీవరీ చేయిస్తుంది. ప్రయాణాలను రద్దు చేయడమే కాకుండా.. అత్యవసర పనులపై వెళ్లే వాళ్లకు స్క్రీనింగ్ నిర్వహించి.. కరోనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.
‘కరోనా భయం ఉన్నప్పటికీ ప్రజలు.. ఆహారం, నీళ్లు, ఇతర అవసరాల కోసం బయటకి వస్తున్నారు. వాళ్లు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం’ అని కలెక్టర్ బీపీ నూహ్ మీడియాకు తెలిపారు. కరోనా ఎఫెక్ట్ కాకుండా కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇంటింటికీ సరఫరా చేస్తుంది.
సేవల్లో నాణ్యత పెంచేందుకు 24 గంటల కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. బ్రాడ్ బ్యాండ్ .. లో క్వాలిటీ ఉండేలా చూస్తున్నారు. సాధ్యమైనంత వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ఆయన సొంతగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
See Also | కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన జేసీ