భళా కేరళ.. కరోనా వైరస్ కట్టడి చేసిందిలా

  • Published By: madhu ,Published On : March 25, 2020 / 08:33 AM IST
భళా కేరళ.. కరోనా వైరస్ కట్టడి చేసిందిలా

Updated On : March 25, 2020 / 8:33 AM IST

కరోనా వైరస్ పుట్టింది చైనాలో..భారతదేశంలో మొట్టమొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో…అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతుందననే భయాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ..అక్కడి పినరయి ప్రభుత్వం తీసుకున్న మెరుగైన చర్యలతో వైరస్ సోకిన వారు కోలుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది.

అబ్జర్ వేషన్ లో ఉన్న వారి సంఖ్య 31 వేలకు చేరుకుంది. 237 మందిని ఐసోలేషన్ వార్డుల్లో చేర్చారు. ఇప్పటి వరకు 2 వేల 921 నమూనాలను పరీక్షల కోసం పంపారు. వాటిలో 2 వేల 342 మందికి నెగటివ్ రాగా..28 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ముగ్గురు రికవరీ అయ్యారు.

కరోనా లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించి..వారిని ఇతరు దగ్గరునుంచి వేరుగా ఉంచడం మొదటి ప్రాధాన్యతగా గుర్తించింది. వీరు ఎక్కడెక్కడ తిరిగారు ? ఎవరెవరితో కలిసి ఉన్నారు ? ఈ కీలకమైన సమాచారాన్ని సేకరించగలిగింది. వీటిని గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సక్సెస్ ఫుల్ అయ్యింది. మూడెంచల విధానాన్ని రూపొందించింది.

అనుమానితులను గుర్తించడం మొదటిది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం రెండోది…వీరితో ఏ మాత్రం సంబంధం లేని వారిని గుర్తించడం మూడోది..వీరందరీ సమాచారాన్ని అత్యంత పకడ్బందీగా చేపట్టింది. ఇలా చేయడంతో వైరస్ మరింత వ్యాపించకుండా కట్టడి చేసినట్లైంది. తొలుత ఇక్కడ మూడు కేసులు రికార్డయ్యాయి. సుమారు 500 మందిని విడి విడి గదుల్లో ఉంచ14 రోజుల పాటు వీరు బయటకు రాకుండా కట్టడి చేయగలిగింది.

పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాత..ఏమీ లేదని తేలే వరకు వారిని అక్కడనే ఉంచేవారు. విదేశాల నుంచి వచ్చే వారు కేరళకు చేరుకుంటారని భావించి…ముందుగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇళ్లలోనూ..అనుమానితులను ఒక గదిలో, మిగిలిన కుటుంబసభ్యులు మరో గదిలో ఉండాలని సూచించింది. 
* మాస్కులు, చేతి గొడుగులు, ప్రత్యేక దుస్తులను అందుబాటులోకి తెచ్చారు. 
* విడి విడి వార్డులను నెలకొల్పడమే కాకుండా..వైద్యులు, నర్సులు, సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. 

* వైరస్ వ్యాప్తి ఎలా చెందుతుందనే విషయంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. 
* అన్నీ రవాణా కేంద్రాల నుంచి విదేశీ ప్రయాణీకుల సమాచారాన్ని సేకరించడం. 
 

* సమర్థవంతంగా పంచాయతీ వ్యవస్థ పనిచేయడం. 
* గ్రామాల్లో అనుమానిత లక్షణాలున్న వ్యక్తి ఎక్కడ కనిపించినా..వెంటనే రాష్ట్ర స్థాయికి చేరిపోయేలా పటిష్టమైన ప్రణాళిక. 

వైరస్ కారణంగా ఆర్థిక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో ప్రజలకు మేలు చేకూరేలా పలు చర్యలు తీసుకుంది. ఏకంగా రూ. 20 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రూ. 500 కోట్లు ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలని, గ్రామాల్లో చర్యలు తీసుకొనేందుకు రూ. 1000 కోట్లు, నిరుపేద రంగానికి రూ. 2 వేల కోట్లు, కరోనా కారణంగా ఆహార ధాన్యాల కొరత ఉంటుందని భావించి..దీనిని అధిగమించడం కోసం, అవసరమైన వారికి ఆహార ధాన్యాలు అందిచడం కోసం రూ. 100 కోట్లు, ఉపాధి హామీ కోసం రూ. 2 వేల కోట్లు, రాయితీ ధరతో ఆహారాన్ని అందించేందుకు రూ. 50 కోట్లు కేటాయించారు. 

ప్రజల ఆరోగ్య విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. 2018, 2019 సంవత్సరంలో వచ్చిన నిఫా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. పెద్ద ఎత్తున్న వచ్చిన ఈ వైరస్ కారణంగా కేవలం 17 మంది మాత్రమే చనిపోయారు. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కితాబిచ్చింది. రాష్ట్రంలో బలమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని వెల్లడించింది. 

అంటు వ్యాధులు నిరోధించాటలంటే కేవలం ఆరోగ్య శాఖకు మాత్రమే చెందినదిగా భావించ లేదు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. అన్ని శాఖలు అలెర్ట్ అయ్యాయి. పాఠశాలల మొదలుకొని కార్యాలయాల వరకు..ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని వర్గాల్లోని కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పటిష్టస్థాయిలో నిర్వహించింది.