Couple Kiss Airblue Flight : విమానంలో ముద్దులతో రెచ్చిపోయిన పాక్ దంపతులు.. వీడియో వైరల్!

పాకిస్తాన్‌కు చెందిన దంపతులు విమానంలో ఏకంగా ముద్దులు పెట్టేసుకున్నారు. విమానంలో తోటి ప్రయాణికుల ముందే ముద్దుల్లో మునిగిపోయారు.

Couple Kiss Airblue Flight : విమానంలో ముద్దులతో రెచ్చిపోయిన పాక్ దంపతులు.. వీడియో వైరల్!

Couple Caught Kissing On Airblue Flight

Updated On : May 27, 2021 / 6:47 AM IST

Couple Kiss Airblue Flight : పాకిస్తాన్‌కు చెందిన దంపతులు విమానంలో ఏకంగా ముద్దులు పెట్టేసుకున్నారు. విమానంలో తోటి ప్రయాణికుల ముందే ముద్దుల్లో మునిగిపోయారు. పక్క ప్యాసింజర్ దంపతుల ముద్దులాట చూడలేక ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మే 20న జరగగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్లే పీఏ-200 ఫ్లైట్‌లో దంపతులిద్దరూ కూర్చున్నారు. విమానం ఎక్కినప్పటి నుంచి దంపతులు ముద్దులు పెట్టుకునే ఉంటున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తి వారి చేష్టలతో చిరాకు పుట్టింది. వెంటనే హెయిర్ హోస్టస్‌కు ఫిర్యాదు చేశాడు.  అయినా దంపతులు ఇద్దరూ పట్టించుకోలేదు. ఎయిర్హోస్టస్‌ చేసేదిమిలేక బ్లాంకెట్‌ ఇచ్చి వెళ్లిపోయింది.

బిలాల్‌ ఫరూక్‌ ఆల్వీ అనే అడ్వకేట్‌ కూడా విమానంలో ప్రయాణిస్తున్నారు. దంపతులు చేష్టలపై చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్‌ కాకుండా చూసుకోవాలని మందిలించారు. దంపతులు విమానంలో ముద్దులాడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.