Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఇలా కూడా వాడతారా.. ‘బుద్ధి లేదూ..!’

ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యామస్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ యూత్ లో మాంచి క్రేజ్ కొట్టేసింది. దశాబ్దం క్రితం ఊరికొకటి కనిపించే ఈ బైక్.. పబ్లిక్ రోడ్లపై పదుల్లో కనిపిస్తున్నాయి. ట్రెండ్ కు తగ్గట్లుగా యూత్ వాడకం ఎక్కువై స్టైల్ గా కొత్త ఫీట్లు చేస్తున్నారు.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఇలా కూడా వాడతారా.. ‘బుద్ధి లేదూ..!’

Royal Enfield

Updated On : August 6, 2021 / 6:19 PM IST

Royal Enfield: ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యామస్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ యూత్ లో మాంచి క్రేజ్ కొట్టేసింది. దశాబ్దం క్రితం ఊరికొకటి కనిపించే ఈ బైక్.. పబ్లిక్ రోడ్లపై పదుల్లో కనిపిస్తున్నాయి. ట్రెండ్ కు తగ్గట్లుగా యూత్ వాడకం ఎక్కువై స్టైల్ గా కొత్త ఫీట్లు చేస్తున్నారు. అంతవరకూ అయితే ఓకే.. కానీ, మితి మీరిన పనులు చేస్తేనే కాస్త చికాగుగా ఉంటది చూసేవాళ్లకు కూడా.

రోడ్ మీద వెళ్తూ.. గర్ల్ ఫ్రెండ్ ఫ్యూయెల్ ట్యాంక్ మీదకు ఎక్కేసింది. అతనికి ఎదురుగా కూర్చొని రన్నింగ్ బైక్ పై ప్రేమించేసుకుంటున్నారు. ఎదురెదురుగా కూర్చొని డ్రైవింగ్ చేయడమే కాకుండా.. ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. వారి పక్కగా పోతున్న ఇతర బైకర్లు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కాసేపటి తర్వాత స్థానికులు వారిని చేరుకుని ఇలాంటి పనులు ఆపాలంటూ హెచ్చరించారు. మీరెక్కడ ఉంటారు.. బైక్ ఇలా ఎందుకు నడుపుతున్నారు. పోలీసులను పిలుస్తామంటూ బెదిరించారు. అంతే ఇంకోసారి ఇలాంటి పనులు చేయం. మీ ప్లేస్‌కు రామని బతిమాలుకోవడంతో విడిచిపెట్టారు.

2015లో గోవాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి నమోదై వైరల్ గా మారింది. మధ్య ప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. మోటార్ సైకిల్ పై ఎదురెదురుగా కూర్చొని ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవడంతో పోలీసు అధికారులు వారిని వెదికిపట్టుకుని రూ.1000 చలానా విధించారు.