Covaxin Single Dose : వారికి వ్యాక్సిన్ ఒక్క డోసు చాలు.. ICMR గుడ్‌న్యూస్

ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. అదేంటంటే... కరోనా సోకిన వారు కొవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలట. అది రెండు డోసులతో సమానంగా

Covaxin Single Dose : ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. అదేంటంటే… కరోనా సోకిన వారు కొవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలట. అది రెండు డోసులతో సమానంగా పని చేస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది. సాధారణంగా రెండు డోసులు తీసుకుంటే వచ్చే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్ బాధితుల్లో ఒక్క డోసుతోనే వస్తున్నాయని వివరించింది. అయితే ఇది ప్రాథమిక ఫలితాలు మాత్రమేనని, ఇంకా మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపింది. ఇది రుజువైతే కొవాగ్జిన్ టీకా సింగిల్ డోసు సిఫార్సు చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Microsoft Windows 11 కొత్త OS వస్తోంది.. మీ PC సపోర్ట్ చేయాలంటే?

కరోనా బారిన పడిన వ్యక్తుల్లో BBV152(కోవాగ్జిన్) వ్యాక్సిన్‌కు యాంటీబాడీ ప్రతిస్పందనలను నిర్ధారించడానికి ICMR శాస్త్రవేత్తలు పైలట్ పరిశోధన నిర్వహించారు. ఫిబ్రవరి నుంచి మే 2021 మధ్యలో కోవాగ్జిన్ టీకా తీసుకున్న 114 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల నుంచి రక్త నమూనాలు సేకరించారు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (NAb) అంచనా వేయడానికి సీరం నమూనాలను ఉపయోగించారు.

Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

ఈ నమూనాలను ల్యాబ్ కి పంపి పరీక్షించారు. వారిలో యాంటీబాడీలు గుర్తించారు. కోవిడ్ బారిన పడని వ్యక్తులు రెండు టీకా డోసులు తీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే యాంటీబాడీలు కనిపించాయో.. కరోనా సోకిన వ్యక్తుల్లో ఒక టీకా డోసు తీసుకోగానే అదే స్థాయిలో యాంటీబాడీలు కనిపించాయని గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు