Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

మీరు ఎప్పుడైనా సినీ స్టార్స్ ను గమనించారా? వారి చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. వారు ఎంతో బలంగా, ధృడంగా ఉంటారు. ఆజానుబాహుల్లా కనిపిస్తారు. సినీ ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా

Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

Bollywood Stars Bodyguards

Bollywood Stars Bodyguards : మీరు ఎప్పుడైనా సినీ స్టార్స్ ను గమనించారా? వారి చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. వారు ఎంతో బలంగా, ధృడంగా ఉంటారు. ఆజానుబాహుల్లా కనిపిస్తారు. సినీ ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా వారి వెంట బాడీగార్డులు కచ్చితంగా ఉంటారు. అంగరక్షకులు లేనిది వారు ఇంటి గడప కూడా దాటరు. అభిమానులు, జనాలు మీద పడిపోకుండా స్టార్స్ ను కాపాడేది ఈ బాడీగార్డులే. నిత్యం వారి వెంటే ఉంటారు. నీడలా ఉంటూ రక్షణ కల్పిస్తారు. కాగా, సినీ తారల అంగరక్షకుల జీతాలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సెలెబ్రిటీలు తమ బాడీగార్డులకు ఇచ్చే జీతం ఎంతుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును, బాడీగార్డులకు వారిచ్చే జీతం అక్షరాల కోట్ల రూపాయల్లో ఉంటుంది.

అమితాబ్ బచ్చన్..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి సెక్యూరిటీగా ముంబై పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర సిన్హా ఉన్నారు. ఇందుకోసం అమితాబ్ ఆయనకు ఏటా 1.5కోట్లు చెల్లిస్తున్నారని సమాచారం. అయితే ఈ వార్తను జితేంద్ర తోసిపుచ్చారు. తానొక పోలీసు అధికారిని అని, ఐదేళ్లు మాత్రమే ఆ డ్యూటీలో ఉంటానని వివరించారు.

షారుక్ ఖాన్…
ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. ఆయన బాడీగార్డుల్లో ముఖ్యమైన వ్యక్తి రవి సింగ్. ఎప్పుడూ షారుక్ వెంటే ఉంటాడు. అభిమానులు, జనాలు షారుక్ ఖాన్ మీద పడిపోకుండా అతడు చూసుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కాగా, షారుక్ ఖాన్ తన బాడీగార్డు రవి సింగ్ కు ఏటా రూ.2.7 కోట్లు జీతంగా చెల్లిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో సెలెబ్రిటీల బాడీగార్డ్స్ లో అత్యధిక మొత్తం అందుకుంటున్న వ్యక్తి రవి సింగ్.

సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ విషయానికి వస్తే.. ఆయన బాడీగార్డు పేరు షేరా. సల్మాన్ కు నీడలా రక్షణగా ఉంటాడు షేరా. ఇకపోతే సల్మాన్ ఖాన్ తన బాడీగార్డు షేరాకు ఏటా రూ.2.5కోట్లు జీతంగా చెల్లిస్తున్నాడు.

అక్షయ్ కుమార్..
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కి కూడా బాడీగార్డు ఉన్నాడు. అతడి పేరు శ్రేసే. అతడు నిత్యం అక్షయ్ దగ్గరే ఉంటాడు. కంటికి రెప్పలా చూసుకుంటాడు. జనాల్లోకి వెళితే ఈగ కూడా వాలనివ్వడు. అంతేకాదు అప్పుడప్పుడు అక్షయ్ కొడుక్కి కూడా సెక్యూరిటీ ఇస్తాడు. అక్షయ్ తన బాడీగార్డుకి ఏటా 1.2కోట్లు చెల్లిస్తున్నాడు.

అమీర్ ఖాన్..
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్. ఈయన ఎంత పెద్ద స్టార్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అమీర్ ఖాన్ కి కూడా ఓ బాడీగార్డు ఉన్నాడు. అతడి పేరు యువరాజ్ గోర్పాడే. ఇతడు నిత్యం అమీర్ ఖాన్ వెన్నంటే ఉంటాడు. ఫుల్ సెక్యూరిటీ ఇస్తాడు. అమీర్ ఖాన్ తన బాడీగార్డు యువరాజ్ కి ఏటా రూ.2కోట్లు జీతంగా చెల్లిస్తున్నాడు.

అనుష్క శర్మ, దీపికా పదుకోన్..
హీరోలే కాదు హీరోయిన్లకు కూడా అంగరక్షకులు ఉన్నారు. ప్రముఖ సినీ తారలు అనుష్క శర్మ, దీపికా పదుకోన్ లకు బాడీగార్డులు ఉన్నారు. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు సోనూ అనే బాడీగార్డు ఉన్నాడు. అనుష్క సోనూని కుటుంబసభ్యుడిలా చూసుకుంటుంది. ఇక ఏటా తన బాడీగార్డుకి రూ.1.2కోట్లు చెల్లిస్తోంది. ఇక దీపికా పదుకోన్ బాడీగార్డు పేరు జలాల్. ఆమె తన బాడీగార్డుకి ఏటా రూ.1.2 కోట్లు చెల్లిస్తోంది.