కరోనా వార్నింగ్: నువ్వు రోడ్డుపైకి వస్తే.. నేను మీ ఇంటికి వస్తా

  • Published By: veegamteam ,Published On : April 2, 2020 / 03:51 AM IST
కరోనా వార్నింగ్: నువ్వు రోడ్డుపైకి వస్తే.. నేను మీ ఇంటికి వస్తా

Updated On : April 2, 2020 / 3:51 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు రోడ్లపైకి రావద్దని పోలీసు అధికారులు ఎంత మోత్తుకుంటున్నా ఎవరూ వారిని లెక్కచేయడంలేదు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఈ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్ణాటక పోలీసులు ఇలా ప్రచారం చేస్తున్నారు. 

బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు నగేణహళ్లి చెక్‌పోస్టు వద్ద  మీరు రోడ్డుపైకి వస్తే.. నేను కూడా మీ ఇంటికి వస్తాను అని కరోనా వైరస్‌ను ఉద్దేశించి రోడ్డుపై రాశారు. అంతెకాదు వైరస్ బొమ్మను కూడా గీశారు. వారు మనకోసం, మనఆరోగ్యం కోసం ఇంతలా కష్టపడుతుంటే మనంమాత్రం వారిని ఏమాత్రం లెక్కచేయకపోవడంతో వారు చాలా బాధపడుతున్నామని తెలిపారు.

ఇక బెంగళూరు పోలీసులు ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడ ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసులు 110కి చేరాయి. కర్ణాటకలో ఈ వైరస్‌ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. తొమ్మిది మంది కోలుకున్నారు. దయచేసి ఇంట్లోనే ఉండండి రోడ్డుపైకి రాకండి అంటూ ప్రజలను కోరారు బెంగళూరు పోలీసులు.