COVID-19: దేశంలో కొత్తగా 10,725 కరోనా కేసులు నమోదు.. యాక్టివ్ కేసులు 94,047

దేశంలో కొత్తగా 10,725 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,084 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 94,047 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.60 శాతం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,37,57,385గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

COVID-19

COVID-19: దేశంలో కొత్తగా 10,725 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,084 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 94,047 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.60 శాతం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,37,57,385గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 3.20 శాతం ఉందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 88.39 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 3,92,837 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 210.82 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. వాటిలో రెండవ డోసులు 94.08 కోట్లు, బూస్టర్ డోసులు 14.50 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. నిన్న దేశంలో 23,50,665 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.

Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు