Delhi Covid: ఢిల్లీ సేఫ్.. గడిచిన 24గంటల్లో 623కేసులు మాత్రమే..

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కేసుల్లో తగ్గు ముఖం పట్టాయి. రోజుకు 40వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదైన ఢిల్లీలో జూన్ 1నాటి లెక్కలను బట్టి కేవలం 623 మాత్రమే నమోదు కావడం హర్షనీయం.

Delhi Covid: ఢిల్లీ సేఫ్.. గడిచిన 24గంటల్లో 623కేసులు మాత్రమే..

Delhi Corona

Updated On : June 1, 2021 / 4:49 PM IST

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కేసుల్లో తగ్గు ముఖం పట్టాయి. రోజుకు 40వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదైన ఢిల్లీలో జూన్ 1నాటి లెక్కలను బట్టి కేవలం 623 మాత్రమే నమోదు కావడం హర్షనీయం. మొత్తం 70వేల 813మందికి టెస్టులు నిర్వహించారు.

వెయ్యి 423మంది కోలుకుని డిశ్చార్జి అవగా 62మంది కొవిడ్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేట్ 0.88శాతంగా ఉంది. పేషెంట్లు ఎక్కువగా ఉన్న సమయంలో బెడ్ల కొరతతోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి.

అటువంటి సమస్యలు ఏం లేకుండా మొత్తం హాస్పిటళ్లలో 24వేల 752బెడ్లు ఉండగా 20వేల 347 ఖాళీగా ఉన్నాయి. కొవిడ్ కేర్ సెంటర్లలో 6వేల 332 బెడ్లకు గానూ 6వేల 148మాత్రమే నిండాయి. కొవిడ్ హెల్త్ కేర్ సెంటర్లలో అందుబాటులో ఉన్న బెడ్స్ 606 ఉంటే 520 ఖాళీగా ఉన్నాయి.

24గంటల్లో జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టులు 46వేల 715 అయితే ర్యాపిడ్ టెస్టులు 24 వేల 98గా ఉన్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 56వేల 623మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఢిల్లీ స్టేట్ హెల్త్ బుల్లెటిన్ లో పేర్కొంది.