Covid-19 : కేరళలో కొత్తగా 9,735 మందికి కరోనా పాజిటివ్
కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత 10 వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid Updates Kerala Reports 9,735 New Covid 19 Cases, 151 Deaths
Corona in kerala : కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత 10 వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 9,735 మంది కరోనా బారినపడ్డారు. కరోనా మరణాలు వందకు పైనే నమోదయ్యాయి.
కొత్తగా 151 మంది కరోనాతో మరణించారు. కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,677కు చేరింది. ప్రస్తుతం రాష్ట్ంరలో 1,24, 441 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ సంఖ్య కన్నా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరిగింది. కొత్తగా 13,878 మంది కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షలు మొత్తం 93,202 మందికి నిర్వహించారు.
Old Car Renewal : మీకు 15ఏళ్లు దాటిన పాత కారు ఉందా? 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే!
మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇవాళ కూడా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగానే నమోదైంది. ఇవాళ కొత్తగా 13,878 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా రికవరీలు, మరణాలు పోను రాష్ట్రంలో 1,24,441 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మొత్తం 93,202 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
Gujarat : గుజరాత్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..భాణ్వఢ్లో కమలానికి గట్టి షాక్