Covid Vaccination: 3 రోజులు వ్యాక్సినేషన్ బంద్..
మహారాష్ట్రలో మూడు రోజుల పాటు కరోనా వ్యాక్సినేషన్ బంద్ అయింది. మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభానికి ముందే మహారాష్ట్రలోని ముంబైలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి.

Covid Vaccination Bandh For Three Days In Mumbai
Covid Vaccination Bandh for Three Days : మహారాష్ట్రలో మూడు రోజుల పాటు కరోనా వ్యాక్సినేషన్ బంద్ అయింది. మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభానికి ముందే మహారాష్ట్రలోని ముంబైలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ముంబైలో టీకాల పంపిణీ ఉండదు. ఈ మేరకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. 18 నుంచి 45 ఏళ్ల వ్యక్తులకు మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్‌లో యువతల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
అందుకే కేంద్రం యువతకు కూడా వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ల కొరత కారణంగా 18-45 ఏళ్ల వ్యక్తులకు వ్యాక్సినేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టీకాల కొరత కారణంగా ముంబైలో ఆదివారం వరకు టీకాల పంపిణీ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బీఎంసీ వెల్లడించింది.
వ్యాక్సిన్ స్టాక్ వస్తే.. ప్రజలకు మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇస్తామని పేర్కొంది. టీకా కేంద్రాల వద్ద గుమిగూడొద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ టీకా వేస్తామని పేర్కొంది. 18-45 ఏళ్ల మధ్య లబ్ధిదారులకు తగినంత టీకాలు లభించిన తర్వాతే పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపింది. మహారాష్ట్రలో 1.55 కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించారు. మహారాష్ట్రలో ఒకే రోజు 66,159 కొవిడ్ కేసులు నమోదు కాగా.. 771 మరణాలు నమోదయ్యాయి.