Covid Vaccination: తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న వ్యాక్సినేషన్

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఊరట కలిగిస్తోంది. అత్యల్ప కేసులతో భయాందోళనల నుంచి ఉపశమనం దొరికింది. కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు కాగా 62 మరణాలు సంభవించాయి.

Covid Vaccination: తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న వ్యాక్సినేషన్

Covid Cases

Updated On : March 23, 2022 / 10:04 AM IST

Covid Vaccination: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఊరట కలిగిస్తోంది. అత్యల్ప కేసులతో భయాందోళనల నుంచి ఉపశమనం దొరికింది. కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు కాగా 62 మరణాలు సంభవించాయి.

ప్రస్తుతం దేశంలో 23వేల 87 యాక్టివ్ కేసులు ఉండగా, దేశంలో ఉన్న కేసుల్లో అది 0.05 శాతం అని రికార్డులు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 4కోట్ల 30లక్షల 12వేల 749 కేసులు నమోదు కాగా, 5లక్షల 16వేల 605 మంది మృత్యువాతకు గురయ్యారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. కరోనా నుంచి మంగళవారం 2542 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారిలో 4కోట్ల 24లక్షల 73వేల 57 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య శఆఖ వెల్లడించింది.

Read Also : భారత్‌లో మరో కొవిడ్ టీకా.. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లలకు..!

వేగవంతంగా వ్యాక్సినేషన్
భారత్‌లో 432 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 181.89 కోట్ల డోసులు అందజేశారు. మంగళవారం 30లక్షల 53వేల 897 డోసులు అందాయని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 181కోట్ల 89లక్షల 15వేల 234 డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.