Private Hospitals: వ్యాక్సిన్ల ధరను ఫిక్స్ చేసిన కేంద్రం.. కొవీషీల్డ్ 780, కొవాగ్జిన్ 1410

అత్యధిక లాభాలకు పోకుండా నిర్ణీత ధరలకే కొవిడ్ వ్యాక్సిన్లు విక్రయించాలని కేంద్రం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ.780, రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ రూ.వెయ్యి 145 వాటితో పాటు కొవాగ్జిన్ రూ.వెయ్యి 410కే అమ్మాలని నిర్ణయించింది.

Private Hospitals: వ్యాక్సిన్ల ధరను ఫిక్స్ చేసిన కేంద్రం.. కొవీషీల్డ్ 780, కొవాగ్జిన్ 1410

Private Hospitals Vaccine

Private Hospitals: అత్యధిక లాభాలకు పోకుండా నిర్ణీత ధరలకే కొవిడ్ వ్యాక్సిన్లు విక్రయించాలని కేంద్రం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ.780, రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ రూ.వెయ్యి 145 వాటితో పాటు కొవాగ్జిన్ రూ.వెయ్యి 410కే అమ్మాలని నిర్ణయించింది. ఇందులోనే సర్వీస్ ఛార్జి రూ.150ఫీజు కూడా కలిపి ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ ఫీజుతో పాటుగా అదనంగా రూ.150 చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రైవేట్ హాస్పిటల్స్ ను రెగ్యూలర్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు మానిటర్ చేయాలని అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కొత్త వ్యాక్సిన్ పాలసీని ప్రకటించి జూన్ 21నుంచి అమలవుతోందని చెపపారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా.. 75శాతం కంపెనీలు, 25శాతం ఇప్పటికే రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులతో వ్యాక్సినేషన్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు 25శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఇప్పటికీ అనుమతి ఉందని తెలిపారు.

ప్రభుత్వం నిర్వహించే సంస్థల్లో అర్హత కలిగిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు.