యజమాని ఎవరో? : ఆవు కోసం కోర్టుకెక్కారు

తెలుగులో ఓ కథ ఉంది.. పిల్లాడి కోసం ఇద్దరు తల్లులు రాజుగారికి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోవడం.. పిల్లాడి నా బిడ్డ అంటే.. నా బిడ్డ అంటూ గొడవ పడతారు.

యజమాని ఎవరో? : ఆవు కోసం కోర్టుకెక్కారు

Updated On : September 23, 2021 / 4:27 PM IST

తెలుగులో ఓ కథ ఉంది.. పిల్లాడి కోసం ఇద్దరు తల్లులు రాజుగారికి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోవడం.. పిల్లాడి నా బిడ్డ అంటే.. నా బిడ్డ అంటూ గొడవ పడతారు.

తెలుగులో ఓ కథ ఉంది.. పిల్లాడి కోసం ఇద్దరు తల్లులు రాజుగారికి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోవడం.. పిల్లాడు నా బిడ్డ అంటే.. నా బిడ్డ అంటూ గొడవ పడతారు. రాజుగారి తెలివిగా ఇద్దరిలో నిజమైన తల్లి ఎవరో కనిపెట్టి ఆ బిడ్డను ఆమెకు అప్పగిస్తారు. ఇదే కథ తరహాలో నిజంగా ఒక ఘటన రాజ్ స్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగింది. కానీ ఇక్కడ.. బిడ్డ కోసం కాదు.. ఆవు కోసం గొడవ.

పోలీస్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్, టీచర్ శ్యాం సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆవు కోసం ఘర్షణ పడ్డారు.  ఆవు నాది అంటే.. నాదని  పొట్లాడకున్నారు. చివరికి ఈ గొడవ కాస్తా కోర్టు మెట్లు ఎక్కేవరకు వెళ్లింది. ముందుగా ఈ ఆవు యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసుల దృష్టికి వెళ్లింది.

కానీ, అక్కడ కూడా ఇరువురి గొడవకు పరిష్కారం దొరకలేదు. పోలీసులు చేసేది ఏమిలేక ఇద్దరి నుంచి ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేశారు. ఆవు విషయంలో తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్, టీచర్ శ్యాం సింగ్ జోధాపూర్ కోర్టును ఆశ్రయించారు.

వీరితో పాటు ఆవును కూడా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆవుకు సంబంధించి ఫిజికల్ ఎగ్జామినేషన్ పూర్తయినట్టు డిపెన్స్ లాయర్ రమేశ్ కుమార్ విష్ణోయ్ తెలిపారు. ఈ కేసుపై ఏప్రిల్ 15న కోర్టు మరోసారి విచారించనున్నట్టు రమేశ్ తెలిపారు.