కలలోనైన అనుకోలేదే..మొక్కజొన్న విత్తనాల్ని ఇలా కూడా ఒలవొచ్చాని..

  • Published By: nagamani ,Published On : August 28, 2020 / 11:23 AM IST
కలలోనైన అనుకోలేదే..మొక్కజొన్న విత్తనాల్ని ఇలా కూడా ఒలవొచ్చాని..

Updated On : August 28, 2020 / 12:05 PM IST

సామాన్యుల టాలెంట్ నుంచి ఫన్నీ వీడియోల వరకూ తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. అటువంటిదే మరోసారి వీడియోను తన ట్విట్టర్ లో వినూత్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన ఆ సైతన షాక్ అయ్యారట.అయ్యారే..ఏమీ వీరు తెలివి అంటూ ఆశ్చర్యానందాలు పొందారట ఆనంద్ మహేంద్రా..ఇంతకీ ఆవీడయో ఏమిటంటే..



స్టాండ్ వేసివున్న బైక్ ను స్టార్ట్ చేసి గేర్ లో ఉంచి..వెనుక చక్రాన్ని తిప్పుతూ..ఆ టైర్ కు మొక్కజొన్న పొత్తులను ఆనించి పట్టుకోగా..పొత్తుకున్న విత్తనాలన్నీ చాలా ఈజీ విడిపోతూ కింద పడుతున్నాయి. ఈ చక్రం తిరిగే వేగానికి పది సెకన్లలోపే ఓ కండె నుంచి విత్తనాలను వేరు చేస్తున్నారు ఇద్దరు రైతులు. చక్రానికి ఇరువైపులా ఇద్దరు కూర్చుని టకటకా..చకచకా పనిచేసేస్తున్నారు.
https://10tv.in/german-man-cuts-his-ears/
ఇక ఈ వీడియో ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. దాన్ని చూసిన ఆయన తెగ ఆనంద పడిపోయారు వారి తెలివికి. ఇటువంటి సృజనాత్మకతను తాను కలలోనైనా చూడలేదన్నారు. “మన వ్యవసాయ విధానంలో బైకులు, ట్రాక్టర్లను వాడుతూ ఎన్నో రకాల పనులను రైతులు సులువుగా చేసుకుంటున్న వీడియోలు నాకెన్నో వస్తుంటాయి. కానీ ఇటువంటి తెలివి మాత్రం నేను కలలో కూడా ఊహించలేదని.. ఇకపై ”కార్న్ టినెంనల్” అనే ప్రత్యేక బ్రాండ్ ను ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో” అంటూ వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిస వీడియోను.