Hasin Jahan : ఫోటో షేర్‌ చేసిన షమీ భార్య.. మండిపడుతున్న నెటిజన్లు

మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఆమె అందాన్ని పొగుడుతుంటే మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

Hasin Jahan : ఫోటో షేర్‌ చేసిన షమీ భార్య.. మండిపడుతున్న నెటిజన్లు

Hasin Jahan

Updated On : August 20, 2021 / 12:05 PM IST

Hasin Jahan : టీం ఇండియా పేసర్ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ లోకి వచ్చి అభిమానులను అలరిస్తుంటారు. ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన ఓ బోల్డ్ ఇమేజ్ తెగ వైరల్ అవుతుంది.

హసీన్ తెలుపు రంగు రగ్గడ్‌ జీన్స్‌, బ్లాక్‌ టాప్‌లో కనిపించారు. ఈ ఫోటో చూసిన వారిలో కొందరు అందంగా ఉన్నారని పొగడగా.. మరికొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్‌.. అయినా కూడా ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా అంటూ మండిపడుతున్నారు.

ఇక షమీ-హసీన్‌ చాలా కాలం నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా జీవిస్తున్నప్పటికి.. ఇంకా వీరు విడాకులు తీసుకోలేదు. గతంలో హసీన్‌ తన భర్తకు వేరే మహిళతో సంబంధ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కానీ వాటిని నిరూపించలేకపోయారు. ఇప్పటికి వీరి విడాకుల కేసు నడుస్తూనే ఉంది. కోల్‌కతాకు చెందిన హసీన్‌ జహాన్‌, షమీ 2014, ఏప్రిల్‌ 7 న వివాహం చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)