CRPF jawans: వీర జవాన్ చెల్లెలు పెళ్లికి కదిలొచ్చిన సైన్యం

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ 2020 అక్టోబర్‌లో కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించాడు.

CRPF jawans: వీర జవాన్ చెల్లెలు పెళ్లికి కదిలొచ్చిన సైన్యం

Wedding Jawan (2)

Updated On : December 15, 2021 / 12:14 PM IST

CRPF jawans: మరణించిన వీర జవాన్ చెల్లెలు పెళ్లికి సైనికులే సోదరులయ్యారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ 2020 అక్టోబర్‌లో కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించాడు. అతనికి గౌరవ సూచకంగా, CRPF జవాన్లు అనేకమంది అతని సోదరి జ్యోతి వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ 13, 2021న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి వెళ్లారు.

అంతేకాదు.. ఆర్మీ యూనిఫాంలోనే పెళ్లిలో శైలేంద్ర ప్రతాప్ సింగ్ చెల్లెలు జ్యోతికి సోదరుడు చేయాల్సిన పనులన్నింటినీ చేశారు జవాన్లు. మండపానికి వెళుతున్నప్పుడు కూడా వారే స్వయంగా పైన క్లాత్2ను కూడా పట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కూతురు జ్యోతికి బహుమతులు అందించి, సంప్రదాయబద్ధంగా దగ్గరుండి పెళ్లి జరిపించారు. పెళ్లి వేడుకకు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు హాజరై చేసిన పనులు చూసిన అతిథులందరూ భావోద్వేగానికి గురయ్యారు.‘‘సోదరుల పాత్రను పోషించిన జవాన్లు అమరవీరుడు శైలేంద్ర లేని లోటును భర్తీ చేయడానికి ప్రయత్నించారు’’ అని ఒక సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

అమరవీరుడు శైలేంద్ర ప్రతాప్ సింగ్ తల్లిదండ్రులు జవాన్లు అందరూ తన కూతురి పెళ్లికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా కొడుకు ఈ లోకంలో లేకపోయినా.. సీఆర్‌పీఎఫ్ జవాన్ల రూపంలో ఎంతోమంది కొడుకులు ఉన్నారు. వారు ఎప్పుడూ మాకు అండగా ఉంటారు.’’ అని శైలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి భావోద్వేగంతో చెప్పారు.