అరేబియా సముద్రంలో మరింత బలపడిన నిసర్గ తుపాన్

అరేబియా సముద్రంలో నిసర్గ తుపాన్ బలపడింది. దీని ప్రభావం వల్ల గుజరాత్, మహారాష్ట్ర తీరాల వద్ద వర్షం కురుస్తోంది. వల్సాద్‌తో పాటు ముంబై తీర ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. రేపు సాయంత్రానికి నిసర్గ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
రెండు రాష్ట్రాలకు చెందిన తీరాల వద్ద జెమినీ బోట్లతో రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కోస్టుగార్డులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లద్దని జాలర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
అరేబియా సముద్రంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ మొదలైనట్లు ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. సింధుదుర్గ, రత్నగిరి, థానే, రాయిగడ్, ముంబై, ఫాల్గర్ లాంటి కోస్తా ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ప్రస్తుతం గోవా రాజధాని పనాజీకి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో నిసర్గ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read: కేరళలో రుతుపవనాలు ఎఫెక్ట్.. తుఫాన్ హెచ్చరికలు.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలు