బలహీన పడిన నివార్ : తమిళనాడులో నేల కూలిన వందలాది చెట్లు, ముగ్గురు మృతి

Cyclone Nivar weakens : తీరం దాటిన తర్వాత నివార్ బలహీనపడి వాయుగుండంగా మారింది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది తిరుపతికి పశ్చిమ నైరుతి దిశగా 30 కిలోమీటర్లు చెన్నైకి పశ్చిమవాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గంటకు 55-75కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవాళ కూడా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడవ నంబరు భద్రతా సూచిక కొనసాగుతోంది.
https://10tv.in/adult-woman-is-free-to-stay-wherever-and-with-whoever-she-wishes-says-delhi-high-court/
నివార్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో ఉద్ధృతమైన గాలులతోకూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వందల చెట్లు నేలకూలాయి. తమిళనాడులో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. అత్యధికంగా పుదుచ్చేరిలో 30 సెంటీమీటర్లు, కడలూరులో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైలో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. మెట్రో రైలు, బస్సు సర్వీసులను పునరుద్ధరించారు.