Cyclone Tauktae : తీవ్ర తుపాన్ గా మారిన తౌటే..కేరళను కుమ్మేస్తోంది

తౌటే తుపాన్ తీవ్ర తుపాన్ గా మారింది. ఉత్తర దిశగా..గంటకు 12 కి.మీటర్ల వేగంతో ప్రయాణించి.. సాయంత్రం 5.30గంటలకు తీవ్ర తుపాన్ గా మారనుంది.

Cyclone Tauktae : తీవ్ర తుపాన్ గా మారిన తౌటే..కేరళను కుమ్మేస్తోంది

Cyclone

Updated On : May 15, 2021 / 10:56 PM IST

Heavy Winds Kerala : తౌటే తుపాన్ తీవ్ర తుపాన్ గా మారింది. ఉత్తర దిశగా..గంటకు 12 కి.మీటర్ల వేగంతో ప్రయాణించి.. సాయంత్రం 5.30గంటలకు తీవ్ర తుపాన్ గా మారనుంది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా..220 కి.మీటర్లు, ముంబైకి దక్షిణ నైరుతి దిశగా..590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగ బలపడి రాగల 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా తౌటే మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అనంతరం ఉత్తర వాయువ్య దిశగా..తుపాన్ ప్రయాణించనుంది. గుజరాత్ తీరం పోర్ బందర్ – నలియాల మధ్య ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం లేదా సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తౌటే తుపా కల్లోలం సృష్టిస్తోంది. గాలులు వేగంగా వీస్తున్నాయి. గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్థంబాలు నేలకూలిపోతున్నాయి.

సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. తౌటే తుపాన్ ప్రభావం ఎక్కువగా కేరళ రాష్ట్రంపై కనిపిస్తోంది. ఇడుక్కి, పాలక్కాడ్‌, మల్లాపురం, త్రిశూర్‌, కోజికోడ్‌, వయనాడ్‌, కన్నూరు, కాసరఘడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్డీఆరఎఫ్, సహాయక బృందాలు మోహరించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. త్రిశూర్‌లో చాలా గ్రామాలు నీట మునిగాయి.

తుపాన్‌పై ప్రధాని మోడీ అత్యవసర సమీక్షను నిర్వహించారు. ఎన్‌డీఎంఏ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు అధికారులు. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడుకు ఎఫెక్ట్‌ ఉందని అధికారులు తెలిపారు.

Read More : Bhuvneshwar Kumar: ఏ ఫార్మాట్ లో ఆడటానికైనా సిద్ధమే.. అసత్యాలు ఆపండి