Daughter Marriage: కూతురు పెళ్ళికి కోసం డబ్బు దాచాడు.. చివరకు పేదలకు పంచాడు..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలా శుభకార్యాలు వాయిదా పడ్డాయి.

Daughter Marriage
Daughter Marriage: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలా శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ఇక ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొద్దీ మంది బంధువులతో వివాహ తంతు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన కూతురి వివాహం నిరాడంబరంగా నిర్వహించి.. ఆ పెళ్ళికి అయ్యే ఖర్చును పేద కుటుంబాలకు పంచిపెట్టాడో వ్యక్తి.. కర్ణాటక రాష్ట్రము మైసూర్ లోని తిలక్ నగరకు చెందిన హరీష్ తన కూతురు పెళ్లి మే 12,13 తేదీల్లో పెట్టుకున్నాడు.
కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా తక్కువ మంది బంధువులను పిలిచాడు. మొదట టౌన్ హాల్ లో ఘనంగా నిర్వహించాలని అనుకున్న, కరోనా కారణంగా ఇంట్లోనే నిరాడంబరంగా నిర్వహించాడు.. పెళ్లికోసం ఉంచిన రూ. 2 లక్షల రూపాయలను ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున పంచాడు. మొత్తం 40 పేద కుటుంబాలకు డబ్బు పంచాడు హరీష్.. అయన చేసిన సహాయానికి కృతఙ్ఞతలు చెబుతున్నారు సాయం పొందినవారు.
లాక్ డౌన్ సమయంలో పనులు లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని హరీష్ తమను దేవుడిలా ఆదుకున్నాడని అంటున్నారు సాయం పొందిన పేదలు