India Covid : కరోనా కల్లోలం, బార్లు, రెస్టారెంట్లు మూసివేత!
బార్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసేవేస్తే ఎలా ఉంటుందనే దానిపై సుదీర్ఘంగా చర్చంచినట్లు తెలుస్తోంది. కేవలం ఫుడ్ డెలివరీల్లో టేక్ అవే అమలు చేస్తే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు...

Delhi Bar
DDMA Meeting : దేశ రాజధానిలో ఆంక్షలు కఠినతరమౌతున్నాయి. కరోనాకు చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే కొన్ని నిబంధనలు చేసిన సర్కార్…ఇప్పుడు మరిన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెలరోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెపుతున్న నేపథ్యంలో.. తదుపరి చర్యలు తీసుకోవాలని డీడీఎంఏ నిర్ణయించింది. అందులో భాగంగా…2022, జనవరి 10వ తేదీ సోమవారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథార్టీ సమావేశం జరిగింది. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
Read More : Afghanistan : అప్ఘాన్ దాటిన పసికందు.. కన్నీళ్లతో కన్నవారికి అందించిన పెంపుడు తండ్రి
పోలీసు శాఖలో దాదాపు వేయి మందికి పైగా కరోనా బారిన పడడం సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో..బార్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసేవేస్తే ఎలా ఉంటుందనే దానిపై సుదీర్ఘంగా చర్చంచినట్లు తెలుస్తోంది. కేవలం ఫుడ్ డెలివరీల్లో టేక్ అవే అమలు చేస్తే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్ ‘మీడియా సెంటర్’ మూసివేసే ఆలోచనలో అధికారులున్నారు. డీడీఎంఏ సూచించిన విధంగానే కేజ్రీవాల్ ప్రభుత్వం వారాంతపు, రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఢిల్లీలో ఆదివారం కొత్తగా 22,751 కోవిడ్ కేసులు నమోదు కాగా..17 మంది మరణించారు. కరోనా పాజిటివిటి రేటు ఢిల్లీలో 23.5 శాతంగా ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 15,49,730 కరోనా కేసులు నమోదవగా వారిలో 25,160 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 60,733 యాక్టీవ్ కేసులున్నాయని ప్రభుత్వం తెలిపింది.