Delhi Businessman: ఉద్యోగిని చంపి బ్యాగులో మెట్రో స్టేషన్ పడేసిన వ్యాపారి

తన ఉద్యోగిని చంపి బ్యాగులో ఉంచి మెట్రో స్టేషన్ వద్ద పారేసిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ లో వస్త్ర వ్యాపారి వద్ద పనిచేస్తున్న 22ఏళ్ల ఉద్యోగి..

Delhi Businessman: ఉద్యోగిని చంపి బ్యాగులో మెట్రో స్టేషన్ పడేసిన వ్యాపారి

Woman Dead Body

Updated On : February 2, 2022 / 2:33 PM IST

Delhi Businessman: తన ఉద్యోగిని చంపి బ్యాగులో ఉంచి మెట్రో స్టేషన్ వద్ద పారేసిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ లో వస్త్ర వ్యాపారి వద్ద పనిచేస్తున్న 22ఏళ్ల ఉద్యోగి తన 36ఏళ్ల యజమానితో సెక్సువల్ రిలేషన్ పెట్టుకుంది. అదంతా వీడియో రికార్డు చేసిన మరో ఉద్యోగి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టాలని ప్లాన్ చేశాడు.

ఇద్దరు పిల్లలున్న వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.

ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న తన మేనల్లుడిని పిలిపించి మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ లో భాగంగా జనవరి 28న సౌత్ ఢిల్లీలోని యూసఫ్ సారాయ్ ప్రాంతంలోని గెస్ట్ హౌజ్ లో రెండు రూంలు అద్దెకు తీసుకున్నారు. పని ఉందని చెప్పి ఉద్యోగిని పిలిపించారు. బాల్కనీలో తాడుతో గట్టిగా కట్టి హత్య చేశారు.

Read Also : పోలీసుల అదుపులో డ్రగ్ పెడ్లర్ టోని అనుచరులు

ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో పెద్ద ట్రాలీ బ్యాగును మోసుకెళ్తున్నట్లుగా రికార్డ్ అయింది. సరోజినీ నగర్ మెట్రో స్టేషన్ లో కనిపించిన బ్యాగ్ ను పోలి ఉండటంతో విచారణలో నిజాలు బయటికొచ్చాయి. ట్యాక్సీలో బ్యాగును మెట్రో స్టేషన్ కు తీసుకొచ్చి పడేశారని స్పష్టమైంది.

హత్య జరిగిన తర్వాత ఉద్యోగి జాకెట్, షూస్, క్యాప్, వ్యాలెట్ ఇతర వస్తువులను మరో మెట్రోస్టేషన్ లో పడేశారు. ఫోన్ ను మాత్రం ఉత్తరప్రదేశ్ తీసుకెళ్లిపోయాడు వ్యాపారి మేనల్లుడు.