Shortage of Oxygen: ఆక్సిజన్ కొరతతో చనిపోయిందని డాక్టర్లను, స్టాఫ్‍పై దాడికి దిగిన పేషెంట్ కుటుంబం
కొవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరిన మహిళ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయింది. ఆవేశంలో ఉన్న బాధితురాలు కుటుంబీకులు డాక్టర్లు, స్టాఫ్ పై దాడికి దిగారు.

Shortage Of Oxygen
Shortage of Oxygen: కొవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరిన మహిళ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయింది. ఆవేశంలో ఉన్న బాధితురాలు కుటుంబీకులు డాక్టర్లు, స్టాఫ్ పై దాడికి దిగారు. అక్కడ వాతావరణం హింసాత్మకంగా మారడంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు నిందితులను మందలించారు.
షబ్నమ్ గెసావత్ అనే మహిళ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి మక్రానా గవర్నమెంట్ హాస్పిటల్ లో సీరియస్ కండీషన్లో జాయిన్ అయింది. హాస్పిటల్ లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి కానీ, రెగ్యూలేటర్ల కొరత ఉంది.
గెశావత్ ను జాయిన్ చేసుకున్న తర్వాత రెగ్యూలేటర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ కుటుంబీకులను కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పారు. షబ్నమ్ కొవిడ్-19తో బాధపడుతూనే ఉంది.
బాధితురాలు ఆక్సిజన్ అందక చనిపోవడంతో ఎనిమిది మంది బంధువులు, షబ్నమ్ స్నేహితులు కలిసి హాస్పిటల్ ఎక్విప్మెంట్ ను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా రజత్ శర్మ, ప్రదీప్ శర్మ అనే ఇద్దరు డాక్టర్లపై దాడి జరిపారు. హాస్పిటల్ లో పనిచేసే మరో డాక్టర్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు.