Tamilnadu CM MK Stalin: సెప్టెంబర్ 14న భారతీయ భాషల దినోత్సవంగా ప్రకటించాలి..

హిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్‌ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

Tamilnadu CM MK Stalin: హిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో అన్ని భాషలను కేంద్రం అధికారిక భాషలుగా పరిగణించాలని, దేశ సంస్కృతి, చరిత్రను బలోపేతం చేయడానికి “హిందీ దివస్” బదులుగా సెప్టెంబర్ 14ని “భారతీయ భాషల దినోత్సవం”గా పాటించాలని స్టాలిన్ అన్నారు. ఈ మేరకే డీఎంకే ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రికి స్థానిక భాషలపై శ్రద్ధ ఉంటే, హిందీతో సమానంగా వాటికి నిధులు కేటాయించాలని స్టాలిన్ అన్నారు.

CM Stalin: ‘ఒక దేశం-ఒకే భాష’ నినాదంపై మండి పడుతున్న తమిళనాడు సీఎం

హిందీ దివస్‌ను పురస్కరించుకుని సూరత్‌లో బుధవారం జరిగిన అఖిల భారత అధికార భాషా సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ అన్ని భారతీయ భాషలకు మిత్రుడని, ఇది అధికారిక భాషగా మొత్తం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందని అన్నారు. దేశంలోని ఏ ఇతర భాషకూ హిందీ పోటీగా ఉండదని, దేశంలోని అన్ని భాషలకు హిందీ మిత్రుడని మీరు అర్థం చేసుకోవాలని సూచించారు.

Tamil Nadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ… ఏమన్నారంటే?

అమిత్ షా వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. దేశంలో ప్రాంతీయ భాషలపై అమిత్ షాకు నిజమైన ప్రేమ ఉంటే.. దేశంలోని 22 షెడ్యూల్డ్ భాషలను అధికారిక భాషగా ప్రకటించిన తర్వాత సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్‌ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఇది భారతదేశం.. హిందీ కాదు. తమిళంతో సహా భారతీయ భాషలను కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషలుగా ప్రకటించాలని డీఎంకే తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు