Tamil Nadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ… ఏమన్నారంటే?

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆ లేఖలో స్టాలిన్ కోరారు.

Tamil Nadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ… ఏమన్నారంటే?

MK Stalin and YS jagan

Updated On : August 14, 2022 / 8:23 AM IST

Tamil Nadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆ లేఖలో స్టాలిన్ కోరారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల చిత్తూరు జిల్లాలో కుశస్థలి నదిపై రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు రిజర్వాయర్ల నిర్మాణం జరిగితే చెన్నై, పరిసర ప్రాంతాల ప్రజల తాగు, సాగు నీటిపై ప్రభావం చూపుతుందని, చెన్నైకు తాగునీటి వనరుగా ఉన్న పూండి రిజర్వాయరు ఇన్ ఫ్లో పై ప్రభావం చూపుతుందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.

Israeli Scientist Creates: స్టెమ్ సెల్స్ ఉపయోగించి పిండోత్పత్తి.. చిట్టెలుకపై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ప్రయోగంలో ముందడుగు

కుశస్థలి నది అంతరాష్ట్ర నది కావడంతో దిగువ రాష్ట్ర అనుమతి లేకుండా ఎగువ రాష్ట్రం ఎలాంటి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించడం ఆమోదించడం, నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని తమిళనాడు సీఎం స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు సూచించారు. వెంటనే ఏపీ ప్రభుత్వం కుశస్థలి నదిపై రిజర్వాయర్ల నిర్మాణం ప్రతిపాదనలు వెనక్కు తీసుకోవాలని కోరారు.