Bars Licence fee: బిగ్ రిలీఫ్.. రెండు నెలలు బార్ల లైసెన్స్ ఫీజు రద్దు

హాస్పిటాలిటీ రంగానికి బిగ్ రిలీఫ్.. కొవిడ్ సెకండ్ వేవ్‌ సమయంలో లాక్‌డౌన్ కారణంగా హాస్పిటాలిటీ రంగం భారీగా కుదేలైంది. రెండు నెలల పాటు బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి.

Bars Licence fee: బిగ్ రిలీఫ్.. రెండు నెలలు బార్ల లైసెన్స్ ఫీజు రద్దు

2 Month Licence Fee Waived Off For Bars In Hotels, Restaurants Closed Due To Lockdown

Updated On : July 2, 2021 / 11:16 AM IST

2-month-licence fee waived off : హాస్పిటాలిటీ రంగానికి బిగ్ రిలీఫ్.. కొవిడ్ సెకండ్ వేవ్‌ సమయంలో లాక్‌డౌన్ కారణంగా హాస్పిటాలిటీ రంగం భారీగా కుదేలైంది. రెండు నెలల పాటు బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లలోని బార్ల కోసం రెండు నెలల లైసెన్స్ ఫీజులను ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసింది. దాంతో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, గెస్ట్ హౌసెస్, క్లబ్బులు కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బు ఆదా కానుంది.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 2 నెలల పాటు బార్లు, రెస్టారెంట్స్, హోటల్స్ మూతపడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే బార్లకు లైసెన్స్ ఫీజును మాఫీ చేస్తున్నట్టు ఢిల్లీ సర్కార్ వెల్లడించింది. సెకండ్ క్వార్టర్ లైసెన్స్ ఫీజు గడువును కూడా పొడిగించింది. జూన్ 30తో ఈ గడువు ముగిసింది. రెండవ త్రైమాసికంలో లైసెన్స్ ఫీజు చెల్లించే చివరి తేదీని జూన్ 30 నుంచి జూలై 31 వరకు పొడిగించింది.

ఈ గడువు తేదీలోగా బార్ల లైసెన్స్‌లు కలిగిన వారంతా బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించాలని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. లేదంటే త్రైమాసిక రుసుము రెట్టింపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా ఢిల్లీలో ఏప్రిల్ 16 నుంచి జూన్ 20 వరకు లాక్‌డౌన్ విధించారు. నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్ పడిన సంగతి తెలిసిందే.