Supreme Staff Corona : సుప్రీంకోర్టులో సగం మంది సిబ్బందికి కరోనా..విచారణలన్నీ ఆన్‌లైన్‌లోనే

50 Percent Supreme Court Staff Test Positive
50 percent Supreme Court Staff Test Positive : దేశంలో కరోనా కేసులు పెరగటం కొనసాగుతూనే ఉంది. రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. సిబ్బంది కరోనా బారిని పడ్డారు. సుప్రీంకోర్టులో 50 శాతం మంది సిబ్బంది మహమ్మారి బారిన పడడం కలకలం రేపుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కోర్టు రూముతో సహా సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేయిస్తున్నారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. సుప్రీంకోర్టు సిబ్బందికి కరోనా ఎంత ఫాస్టుగా స్ప్రెడ్అయ్యిందంటేజజ శనివారం (ఏప్రిల్ 10,2021) ఒక్క రోజే 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలటం తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు అప్పమత్తమైన చర్యలు చేపట్టారు.గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడడ్డారు. అనంతరం కోలుకున్న విషయం తెలిసిందే.
కాగా..ఇండియాలో గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఎంతగా అంటే గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు పెరుగుతున్న వైరస్ తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. అలా పెరుగుతూ పెరుగుతూజజవరుసగా ఆరవరోజు కూడా లక్ష మార్కును దాటేసింది. గత 24 గంటల్లో ఏకంగా లక్ష దాటేసి 1,68,912 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం కావటం ఆందోళన కలిగిస్తోంది.