Delhli CM Atishi: అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి పై కేసు నమోదు

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ..

Delhi CM Atishi

Delhli CM Atishi: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా.. 17వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ ఇవాళ కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారమే నామినేషన్ దాఖలు చేయాలని ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు.. అప్పటికే సమయం మించిపోవడంతో నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. దీంతో మంగళవారం ఉదయం ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

Also Read: National Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. ఎంపీ అర‌వింద్‌పై సంజయ్ ప్రశంసలు 

సోమవారం నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుగా.. కల్కాజీ ఆలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి అతిషి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇదిలాఉంటే.. ఢిల్లీ సీఎం అతిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతిషి తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించారని కల్కాజీ నియోజకవర్గ వాసి కేఎస్ దుగ్గల్ గోవింద్ పురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది.

Also Read: Padi Kaushik Reddy: బెయిల్ పై బయటకొచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ముఖ్యమంత్రి అతిషి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహనంలో కల్కాజీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి ఎన్నికల సామాగ్రి తెప్పించినట్లు కేఎస్ దుగ్గల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అతిషి వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చిన సౌత్ ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు.