అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కోసం డిమాండ్

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 06:36 AM IST
అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కోసం డిమాండ్

Updated On : November 11, 2019 / 6:36 AM IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమం అయిన తరువాత అయోధ్యకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. 

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు అయోధ్య ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని తివారీ అన్నారు. దీంతో అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చాలా అవసరమని అన్నారు. దీనికి సంబంధించి మనోజ్ తివారీ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పూరీకి లేఖ రాశారు. 

అయోధ్యను ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనీ..అయోధ్యలో  ఎయిర్‌పోర్టును నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. త్వరలోనే మంత్రిని మనోజ్ తివారీని కలిసి ఈ విషయంపై మాట్లాడతారని స్థానిక బీజేపీ నాయకులు అటున్నారు.