ప్రమాణ స్వీకారోత్సవంలో పాట పాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఆదివారం పిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేసారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేజ్రీవాల్ తోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లీట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణం స్వీకారం కార్యక్రమం నిర్వహించారు.
ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో ప్రజల మధ్యలో కేజ్రీవాల్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున హాజరు అయ్యారు. కాగా, ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగింపు సమయంలో కేజ్రీవాల్ ఒక పాట పాడారు. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి అని ముందే సభకు వచ్చిన ప్రజలకు విన్నవించారు. మనందరి సమిష్టి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన అని కేజ్రీవాల్ ఆహూతులకు చెప్పారు.
ఆ విధంగానే ఈ కార్యక్రమంలో భాగంగా కేజ్రీవాల్ ‘హమ్ హోంగే కామ్ యాబ్’ (we shall overcome) పాటను పాడి..అందరితో పాడించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1960 లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో ‘we shall overcome’ పాట ఎంతో ప్రాచుర్యం పొంది..ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ హమ్ హోంగే కామ్ యాబ్ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.
#WATCH Delhi Chief Minister Arvind Kejriwal sings ‘Hum honge kaamyaab’, at his swearing-in ceremony pic.twitter.com/hwXi8FUW46
— ANI (@ANI) February 16, 2020