దానిపై ఎలా పోరాడాలో నన్ను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలి: కేజ్రీవాల్

Arvind Kejriwal: త్వరలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని కూడా మోదీ నాశనం చేయబోతున్నారని కేజ్రీవాల్ చెప్పారు.

దానిపై ఎలా పోరాడాలో నన్ను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలి: కేజ్రీవాల్

Kejriwal

Updated On : May 11, 2024 / 3:31 PM IST

అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలో తనను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. తన క్యాబినెట్లోని మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేసిన చరిత్ర తనదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానంటూనే అందుకు వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని తెలిపారు.

దొంగలను బీజేపీలో చేర్చుకొని మంత్రి, ముఖ్యమంత్రిని చేశారని కేజ్రీవాల్ చెప్పారు. విపక్ష నేతలందరినీ జైల్లో వేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ భావిస్తున్నారని అన్నారు. అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషి, శివరాజ్ సింగ్ చౌహన్, వసుంధర రాజే వంటివారి రాజకీయ జీవితాన్ని మోదీ నాశనం చేశారని తెలిపారు.

త్వరలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని కూడా మోదీ నాశనం చేయబోతున్నారని కేజ్రీవాల్ చెప్పారు. మోదీ నియంతృత్వంతో దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. దేశాన్ని కాపాడాలని 140 కోట్ల ప్రజలను కోరుతున్నానని చెప్పారు. తనకు బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. దేశాన్ని మోదీ నుంచి కాపాడేందుకు దేశం మొత్తం తిరుగుతానని అన్నారు.

Also Read: తడాఖా చూపిస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు: కేసీఆర్