Delhi Cops: ఢిల్లీ పోలీసులపై ఆఫ్రికన్ల దాడి.. అక్రమంగా ఉంటున్న వారిని అరెస్టు చేసినందుకు తిరుగుబాటు

అక్కడ అక్రమంగా ఉంటున్న ఐదుగురు నైజీరియన్లు గుర్తించింది. వీళ్లు తమ వీసీ గడువు ముగిసినప్పటికీ, ఢిల్లీలోనే ఉంటున్నారు. వాళ్లను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ తరలించాలనుకున్నారు. అలా ఐదుగురిని అదుపులోకి తీసుకుని వెళ్తుండగా, ఆఫ్రికా దేశాలకు చెందిన 150-200 మంది పౌరులు అడ్డుకున్నారు.

Delhi Cops: ఢిల్లీ పోలీసులపై ఆఫ్రికన్ల దాడి.. అక్రమంగా ఉంటున్న వారిని అరెస్టు చేసినందుకు తిరుగుబాటు

Updated On : January 8, 2023 / 4:53 PM IST

Delhi Cops: ఢిల్లీలో పోలీసులపై ఆఫ్రికన్లు దాడి చేశారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. యాంటీ డ్రగ్స్ ఫోర్స్‌కు చెందిన ఒక పోలీసు బృందం శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ అక్రమంగా ఉంటున్న ఐదుగురు నైజీరియన్లు గుర్తించింది.

China Ends Quarantine: చైనాలో విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఎత్తివేత.. మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి

వీళ్లు తమ వీసీ గడువు ముగిసినప్పటికీ, ఢిల్లీలోనే ఉంటున్నారు. వాళ్లను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ తరలించాలనుకున్నారు. అలా ఐదుగురిని అదుపులోకి తీసుకుని వెళ్తుండగా, ఆఫ్రికా దేశాలకు చెందిన 150-200 మంది పౌరులు అడ్డుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి పోలీసులు అంగీకరించకపోవడంతో వారిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్న వారిలో ఇద్దరు అక్కడ్నుంచి పారిపోయారు. పోలీసులకు, ఆఫ్రికన్లకు మధ్య అక్కడ చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం మరో బృందాన్ని అక్కడికి పంపిచారు.

Akhilesh Yadav: పోలీసులు ఇచ్చిన టీ తాగని అఖిలేష్ యాదవ్.. విషం కలిపారేమో అంటూ అనుమానం

అప్పటికీ, ఈ పోలీసుల్ని కూడా అడ్డుకునేందుకు ఆఫ్రికన్లు ప్రయత్నించారు. అయితే, పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించడంతో అక్రమంగా ఉంటున్న నిందితుల్ని అరెస్టు చేయగలిగారు. అనంతరం నైజీరియన్లను పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్టైన నిందితుల్లో ఒకరిపై గతంలో చీటింగ్ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం పోలీసులు మరింత మంది నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.