Satyendra Jain Vedio Leak: ఈడీకి నోటీసు జారీ చేసిన ఢిల్లీ కోర్టు
తీహార్ జైలులో సత్యేందర్ జైన్‌కు హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ఈడీ గతంలో చేసిన వాదనలు చేయడంతో తాజాగా బయటికి వచ్చిన వీడియో చర్చకు దారితీసింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఆధారాలను ఆర్థిక దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది.

Delhi court issues notice to ED over leaked video of Satyendra Jain
Satyendra Jain Vedio Leak: ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు మసాజ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న వీడియో జైలు నుంచి బయటికి రావడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. జైలులోని జైలులోని సీసీటీవీ పుటేజీలు బయటికి లీకేజీ కావడంపై సత్యేంద్ర జైన్ లీగల్ టీం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఇచ్చిన హామీని బేఖాతరు చేస్తూ ఈడీ సీసీటీవీ ఫుటేజీని లీక్ చేసిందని కోర్టుకు అందించిన పిటిషన్లో జైన్ లీగల్ టీమ్ పేర్కొంది.
విచారణ చేపట్టినప్పటికీ వీడియో ఎలా లీక్ అయిందని ఈడీని కోర్టు ప్రశ్నించింది. ఈడీకి నోటీసు పంపడంతో పాటు ఈ కేసు విచారణను నవంబర్ 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తీహార్ జైలు గదిలో సత్యేందర్ జైన్ మసాజ్ చేస్తున్న పాత వీడియోను బిజెపి విడుదల చేసింది. వీడియో పాతదని, సంబంధిత అధికారులు, జైలు సిబ్బందిపై అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని తీహార్ జైలు వర్గాలు తెలిపాయి.
తీహార్ జైలులో సత్యేందర్ జైన్‌కు హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ఈడీ గతంలో చేసిన వాదనలు చేయడంతో తాజాగా బయటికి వచ్చిన వీడియో చర్చకు దారితీసింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఆధారాలను ఆర్థిక దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది.
ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో ఇక బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర యుద్ధానికి దారి తీసింది. ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేస్తూ ‘‘జైలులో మాజీ మంత్రికి రాచమర్యాదలు, మసాజ్‌లు’’ అంటూ బీజేపీ విరుచుకు పడుతుండగా.. అది మసాజ్ కాదని, గాయానికి చికిత్స చేస్తున్నారని బీజేపీ విమర్శల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది ఆప్.
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్‌కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్రకారం.. ఆయనను చూస్తున్నారా? ఆప్ అన్ని చట్టాల్ని చెత్త బుట్టలో వేసింది. నేరస్తుల్ని ఆప్ కాపాడుతోందనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే బీజేపీ విమర్శలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందిస్తూ ‘‘గాయపడ్డ వ్యక్తులపై జోకులు వేయడం ఒక్క భారతీయ జనతా పార్టీ నేతలకే సాధ్యం. వాస్తవానికి సత్యేంద్ర జైన్ నడుము దెబ్బతిన్నది. దానికితోడు ఆయనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటికి ఆయన చికిత్స చేయించుకున్నారు. దాన్ని మసాజ్ అని, ఎంజాయ్ అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం మూర్ఖత్వం’’ అని అన్నారు.
Gujarat Polls: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన కూలీ.. డిపాజిట్‌గా 10 వేల రూపాయి నాణేలు