పాకిస్తాన్ హై కమిషన్ సమీపంలో తన రివాల్వర్‌తో తానే కాల్చుకున్న సీఆర్పీఎఫ్ జవాన్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) జవాన్.. పాకిస్తాన్ హై కమిషన్ సమీపంలో సూసైడ్ ప్రయత్నం చేశాడు. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్‌ను AIIMS ట్రామా సెంటర్ లో చేర్పించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
‘మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్ తనంతట తానే సర్వీస్ ఆయుధంతో కాల్చుకున్నాడు. అతని సహోద్యుగుల సహకారంతో ట్రామా సెంటర్ కు తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతుంది’ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.