Delhi Metro
Couple Kissing In Delhi Metro : ఢిల్లీ మెట్రోలో అనేక అసభ్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మహిళల మధ్య ఘర్షణలు, ఆకతాయిల విచిత్ర వేషదారణలు, ముద్దులతో రెచ్చిపోయిన యువతీయువకులు ఇలా అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెట్రోలో ప్రయాణించే కొందరు పలుసార్లు అనుచిత ప్రవర్తనతో తోటి ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు అనేక నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. తాజాగా ఢిల్లీ మెట్రో కోచ్‌లో యువతీ, యువకుడు ముద్దుపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.
Read Also: Delhi Metro: ఏంటి బ్రో ఇది..! ఢిల్లీ మెట్రోలో మహిళలు డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్
ఢిల్లీలోని ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో యువతీ, యువకుడు ముద్దులతో రెచ్చిపోయారు. మెట్రో డోర్‌కు ఆనుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌మ్యాన్ అనే నెటిజన్ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి శీర్షికగా.. ‘ప్రేమ గుడ్డిది.. మనుషులు కాదని మనం మరిచిపోయి ఉండవచ్చు’ అంటూ పేర్కొన్నారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు జంటపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని DMRC (Delhi Metro Rail Corporation) ను కొందరు నెటిజన్లు కోరారు. ఓ నెటిజన్ ఇలా రాశాడు.. జంట యొక్క అపరిపక్వతను ఈ వీడియో చూపుతుంది.. ఇంకా ఎక్కువసేపు దీనిగురించి చర్చించుకోవడం అనవసరం అంటూ పేర్కొన్నాడు. మెట్రో రైళ్లలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మెట్రో సిబ్బంది సాధారణ దుస్తుల్లో స్టేషన్ లలో, రైల్వే బోగీల్లో పెట్రోలింగ్ చేయాలని సూచించాడు. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో స్పందించింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనల సమయంలో మెట్రో సిబ్బంది లేదా సీఐఎస్ఎఫ్ కి వెంటనే తెలియజేయండి.. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చు అని ప్రయాణికులను కోరింది.
Another emotional video of Anand Vihar #delhimetro (OYO).
Maybe we have forgotten that love is blind, people are not.#HBDAtlee #ISKCON #ICCRankings #JustinTrudeau #Shubh #MindfulLiving #PeaceDay #CHEN #TejRan #ShafaliVerma pic.twitter.com/EKSJs2p54d— Postman (@Postman_46) September 21, 2023
గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయ. గత కొద్ది నెలల క్రితం మెట్రో కోచ్ లో ఓ జంట కిందకూర్చొని ముద్దు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో డీఎంఆర్సీ స్పందించింది. ఢిల్లీ మెట్రోను ఉపయోగించేటప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది.