Delhi NCR: పేరెంట్స్‌కు పరిచయం చేస్తానని నమ్మించి 25మందితో రేప్‌కు కారణమైన ఫేస్‌బుక్ ఫ్రెండ్

ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాటలు నమ్మిన 23ఏళ్ల యువతి జీవితం చిన్నాభిన్నమైంది. పేరెంట్స్ కు పరిచయం చేస్తానని నమ్మబలికిన వ్యక్తి అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుందామని..

Delhi NCR: పేరెంట్స్‌కు పరిచయం చేస్తానని నమ్మించి 25మందితో రేప్‌కు  కారణమైన ఫేస్‌బుక్ ఫ్రెండ్

Ssc Student Raped In Kamareddy District

Updated On : May 15, 2021 / 5:46 PM IST

Delhi NCR: ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాటలు నమ్మిన 23ఏళ్ల యువతి జీవితం చిన్నాభిన్నమైంది. పేరెంట్స్ కు పరిచయం చేస్తానని నమ్మబలికిన వ్యక్తి అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుందామని.. పేరెంట్స్ తో మాట్లాడిస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు. 9రోజులకు కోలుకున్న బాధితురాలు శక్తిని కూడదీసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఢిల్లీలో సాధారణ ఉద్యోగం చేస్తున్న మహిళ.. నాలుగేళ్లుగా అక్కడే ఉంటుంది. జనవరిలో ఫేస్ బుక్ ద్వారా సాగర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. చనువు పెరగడంతో ఫోన్ లలో మాట్లాడటం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని యువతికి ప్రపోజ్ చేశాడు.

హోడల్ అనే ప్రాంతంలో పేరెంట్స్ ఉంటారని అక్కడకు వస్తే నేరుగా కలవొచ్చని చెప్పాడు. మే3న అతణ్ని కలిసిన యువతిని రామ్ ఘర్ గ్రామంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాగర్ అతని సోదరుగు ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి మద్యం తాగారు.

ఆ ప్రాంతానికి యువతి రాగానే బలవంతంగా ఆమెను రేప్ చేశారు. రెండో రోజు ఆకాశ్ అనే స్క్రాప్ డీలర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ మరో ఐదుగురు ఆమెను రేప్ చేశారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బదార్పూర్ బోర్డర్లో విసిరేసి అక్కడి నుంచి పరారయ్యారు.

మే12న హస్సాన్ పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. శుక్రవారం సాగర్ ను అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.