ISIS Terrorist Arrest : ఢిల్లీలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అరెస్ట్
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ సైఫీని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింది....

ISIS Terrorist Arrest
ISIS Terrorist Arrest : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ సైఫీని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింది. (Delhi Police Arrest ISIS Terrorist) ఐసిస్ ఉగ్రవాది షానవాజ్ తలపై రూ. 3 లక్షల బహుమతి ఉంది. (3 Lakh Bounty On His Head) పూణే కేసులో ఈ ఉగ్రవాది నిందితుడు.
Mexico : మెక్సికోలో కూలిన చర్చ్ పైకప్పు…ఏడుగురి మృతి
ఇంజినీర్ అయిన ఉగ్రవాది షానవాజ్ తన గుర్తింపును దాచిపెట్టి ఢిల్లీలో నివసిస్తుండగా ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు అయిన ఉగ్రవాది నుంచి పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు. దేశంలోని అనేక టెర్రర్ మాడ్యూల్స్‌ను అణిచివేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులతో కలిసి పనిచేస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఐసిస్ ఉగ్రవాదుల గురించి మరిన్ని విషయాలు వెలుగుచూడనున్నాయి.