Viral Video: అందరినీ ఆకర్షిస్తున్న ప్రైమరీ టీచర్‌ యాక్టివిటీ.. ఏం చేశారో తెలుసా?

రెండు చేతులు చాచి ఓ వైపునకు వంగితే ఆ చేతుల పొడవు ఎంత ఉంటుందో మన శరీర పొడవు కూడా అంతే ఉంటుందని ఆ టీచర్ ప్రాక్టికల్‌గా చూపారు.

ఢిల్లీకి చెందిన ఓ ప్రైమరీ టీచర్‌ క్లాస్‌ రూమ్‌లో చేసిన యాక్టివిటీ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ స్వప్న తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

మొదట నేలపై కుడి చేతిని పెట్టి, అలాగే ఎడమచేతిని కూడా చాలా బోర్డుపై పెట్టారు ఆ టీచర్‌. ఎడమ వేళ్ల కొన వద్ద ఓ గీత గీయాలని ఓ విద్యార్థికి చెప్పారు. అనంతరం తన ఎత్తును ఆమె కొలుచుకున్నారు. ఆ విద్యార్థి గీత ఎక్కడ గీచారో అంత వరకు ఆ టీచర్‌ ఎత్తు ఉండడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇదే యాక్టివిటీని మరికొంత మంది విద్యార్థులు చేశారు.

విద్యార్థులతో టీచర్ స్వప్న చేయించిన యాక్టివిటీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే కోటిన్నరకు పైగా వ్యూస్‌ వచ్చాయి. రెండు చేతులు చాచి ఓ వైపునకు వంగితే ఆ చేతుల పొడవు ఎంత ఉంటుందో మన శరీర పొడవు కూడా అంతే ఉంటుందని ఆ టీచర్ ప్రాక్టికల్‌గా చూపారు.

Sobhita Dhulipala : పెళ్ళికి ముందే అత్తారింట్లో దీపావళి సెలబ్రేట్ చేసుకున్న శోభిత.. అక్కినేని ఫ్యామిలీ ఫోటో వైరల్..