Sobhita Dhulipala : పెళ్ళికి ముందే అత్తారింట్లో దీపావళి సెలబ్రేట్ చేసుకున్న శోభిత.. అక్కినేని ఫ్యామిలీ ఫోటో వైరల్..
ఇప్పటికే శోభిత పెళ్ళికి ముందే అత్తారింట్లో తిరిగేస్తూ సందడి చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ లో పాల్గొంటుంది.

Sobhita Dhulipala Celebrating Diwali with Akkineni Family Photo goes Viral
Sobhita Dhulipala : నాగచైతన్య – శోభిత ధూళిపాళ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకొని పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు రెండు ఫ్యామిలీలు. డిసెంబర్ లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు టాలీవుడ్ సమాచారం. అయితే ఇప్పటికే శోభిత పెళ్ళికి ముందే అత్తారింట్లో తిరిగేస్తూ సందడి చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ లో పాల్గొంటుంది.
Also Read : Gayatri Bhargavi : మా పక్కింట్లో ఉండేవారు.. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారు.. స్టార్ హీరోపై యాంకర్ వ్యాఖ్యలు..
ఇటీవల ఏఎన్నార్ నేషనల్ అవార్డు ఈవెంట్లో కూడా శోభిత హాజరయి సందడి చేసింది. నాగార్జున ఆ ఈవెంట్ కు వచ్చిన చాలా మందికి కాబోయే కోడలిని పరిచయం చేసాడు. తాజాగా శోభిత అక్కినేని ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. నాగార్జున, అఖిల్, నాగచైతన్య, శోభిత, అమల.. ఇలా ఫ్యామిలీ అంతా ఉన్న ఫోటో లీక్ అయింది. శోభిత పెళ్ళికి ముందే అత్తారింటి ఈవెంట్స్ కి వెళ్లడమే కాక పండగలను కూడా ముందే అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది.
పెళ్ళికి ముందే అక్కినేని ఫ్యామిలీతో కలిసిపోయి పండగలు, ఈవెంట్స్ చేసుకుంటున్న శోభిత ఇక పెళ్లయ్యాక ఫ్యామిలీతో కలిసి ఇంకెంత సందడి చేస్తుందో అని ఫ్యాన్స్, నెటిజన్లు అనుకుంటున్నారు. శోభిత త్వరగానే అక్కినేని ఫ్యామిలీతో కలిసిపోయింది అంటున్నారు.