యూరప్ దేశాల్లో మాదిరిగా…ఢిల్లీ రోడ్లు రీడిజైన్ కు సీఎం ఆదేశం

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2019 / 02:02 PM IST
యూరప్ దేశాల్లో మాదిరిగా…ఢిల్లీ రోడ్లు రీడిజైన్ కు సీఎం ఆదేశం

Updated On : October 22, 2019 / 2:02 PM IST

ఢిల్లీలోని అన్నీ రోడ్లను రీడిజైన్ చేయనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణలతో దూరంలో కంటికి కనిపించేటట్లుగా పీడబ్యూడీ మేనేజ్ చేస్తున్న ఢిల్లీ రోడ్లను మార్చనున్నట్లు ఆయన తెలిపారు. పైలెట్ బేసిస్ కింద 45కిలోమీటర్లు గల 9రోడ్లను ప్రభుత్వం సెలక్ట్ చేసిందని,వర్క్ ఆర్డర్ జారీ చేశామని,ఏడాదిలోపు పని పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.

ఢిల్లీలో 1,260కిలోమీటర్ల రోడ్లను పీడబ్యూడీ మేనేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. రీడైన్ చేయబడ్డ రహదారి విస్తరణలు యూరోపియన్ దేశాల్లోని రోడ్లతో సమానంగా ఉంటాయని ఆయన అన్నారు. ఇందులో ల్యాండ్ స్కేపింగ్, పాదచారుల కోసం స్థలం, మోటరైజ్ చేయని వాహనాలు, దివ్యాంగులకు కూడా స్థలం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.