Air Quality : వరుసగా నాలుగోరోజు..ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయుకాలుష్యం

ఢిల్లీలోవాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు కూడా వాయుకాలుష్యం 'చాలా పేలవమైన(Very Poor) కేటగిరీలో కొనసాగుతోంది. అయితే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

Air Quality : వరుసగా నాలుగోరోజు..ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయుకాలుష్యం

Delhi (1)

Updated On : November 17, 2021 / 8:38 AM IST

Air Quality ఢిల్లీలోవాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు కూడా వాయుకాలుష్యం ‘చాలా పేలవమైన(Very Poor) కేటగిరీలో కొనసాగుతోంది. అయితే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మంగళవారం 396 పాయింట్లు ఉండగా..ఇవాళ 379 కి తగ్గినట్లు సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ & వెదర్ ఫోర్‌కాస్టింగ్ & రీసెర్చ్ (SAFAR) తెలిపింది.

గాలిలో పెరిగిన దుమ్ము ధూళి,కాలుష్య కారకాల శాతంతో రోడ్లపై విజబులిటీ తగ్గిపోయింది. వాయుకాలుష్యం నేపథ్యంలో వృద్ధులు,చిన్నారులు,ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

దీపావళి సందర్భంగా ప్రజలు టపకాయలు కాల్చడం,ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడమే  ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.

ఇదిలావుండగా,వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాలలో… వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సిఎక్యూఎం) నిర్మాణ పనులపై నిషేధం, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం, ఇంటి నుండి పని చేయడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించే ఇతర చర్యల వంటి ఆదేశాలను మంగళవారం జారీ చేసింది.

గాలి నాణ్యత(Air Quality)

0- 50 మధ్య ఉంటే ‘మంచిదిగా(Good)’, 51-100 ‘సంతృప్తికరమైనదిగా(Satisfactory)’, 101- 200 ‘ఓ మోస్తరుగా ఉన్నదిగా(Moderately polluted)’, 201- 300 ‘పూర్ గా(Poor)’, 301- 400 ‘చాలా పేలవమైనదిగా(Very Poor)’ మరియు 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది(Severe)’గా పరిగణిస్తారు.