హిప్నటైజ్ చేసిన అమెజాన్ డెలివరీ బాయ్.. కళ్లు తెరిచి చూడగానే షాకైన మహిళ

  • Published By: vamsi ,Published On : October 11, 2019 / 06:53 AM IST
హిప్నటైజ్ చేసిన అమెజాన్ డెలివరీ బాయ్.. కళ్లు తెరిచి చూడగానే షాకైన మహిళ

Updated On : October 11, 2019 / 6:53 AM IST

అమెజాన్ డెలివరీ బాయ్ ఒకతను హిప్నటైజ్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీకి దగ్గరలోని నోయిడా ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన 43ఏళ్ల మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఆమె అమెజాన్ లో ఓ బాక్స్ ఆర్డర్ చేసింది. అయితే వచ్చిన ప్రాడక్ట్ తనకు నచ్చకపోవడంతో రిటర్న్ పెట్టింది. దీంతో అమెజాన్ డెలివరీ బాయ్ బాక్సులను తీసుకెళ్లేందుకు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు.

అయితే అవి రిటర్న్ తీసుకునేందుకు వచ్చిన అమేజాన్ ఎజెంట్ తో మహిళ గొడవ పెట్టుకుంది. తనకు వచ్చిన పెద్ద బాక్స్ లో ఐదు చిన్న బాక్సులు ఉండగా ఐదు చిన్న బాక్సులను రిటర్న్ చేయాలనుకుంది. కానీ అతను నాలుగు మాత్రమే రిటర్న్ తీసుకునేందుకు ఒప్పుకోగా.. ఆమె ఒప్పుకోలేదు. ఐదు చిన్న బాక్సులను తీసుకోవాలంటూ గొడవ పెట్టుకుంది. దీంతో అమెజాన్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి సదరు డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేసింది మహిళ. అమెజాన్ కంపెనీ ప్రతినిధులు ఆ డెలివరీ బాయ్ ను అక్కడినుంచి తిరిగి ఆఫీస్ కు రావలసిందిగా ఆదేశించారు.

తర్వాత డెలివరీ బాయ్ మళ్లీ ఆ మహిళ ఇంటికి వెళ్లి ఐదు బాక్సులను తీసుకెళ్తానని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అమెజాన్ కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడానని వేరే డెలివరీ బాయ్ ను పంపుతామని చెప్పారని తెలిపింది. అయితే అతనితో మాట్లాడుతుండగానే స్పృహ తప్పి పడిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆ డెలివరీ బాయ్ ప్యాంటు విప్పి తన ముందు నిలబడి ఉన్నాడు. దీంతో మహిళ షాక్ కు గురైంది.

వెంటనే సాయం కోసం అరవగా ఎవరూ రాలేదని, తానే బాత్ రూమ్ లోకి వెళ్లి కట్టె తెచ్చి డెలివరీ బాయ్ పైన దాడి చేయగా అతను పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై అమెజాన్ ప్రతినిధులు కూడా స్పందించారు. కస్టమర్ల భద్రతే తమకు ముఖ్యమని, సదరు డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.