లాక్‌డౌన్‌ని ధిక్కరించి దేవాలయాల్లో భక్తులు: పోలీసులపై దాడులు

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 07:43 AM IST
లాక్‌డౌన్‌ని ధిక్కరించి దేవాలయాల్లో భక్తులు: పోలీసులపై దాడులు

Updated On : April 3, 2020 / 7:43 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోతే.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం సూచించిన సామాజిక దూర నిబంధనలకు విరుద్ధంగా ‘జై శ్రీ రామ్’ అంటూ నినాదాలు చేస్తూ.. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో దేవాలయాల్లో వేలాది మంది భక్తులు సమావేశం అయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల బయట భక్తుల క్యూలు కనిపించాయి. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా విహెచ్‌పి మరియు ఇతర కాషాయ సంఘాలు కార్యక్రమాలను విరమించుకున్నాయి. కానీ భక్తులు రోడ్లపై, దేవాలయాల్లో ఎక్కువగా కనిపించారు. (మహమ్మారి భయంతో కరోనా బీరు ఆపేశారు!!)

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలంటూ, సామాజిక దూర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసినా భక్తులు పట్టించుకోలేదు. తూర్పు మహానగరంలోని బెలియాఘాటా మరియు మణిక్తాలా ప్రాంతంలోని అనేక దేవాలయాల బయట సమావేశాలు ఎక్కువగా కనిపించాయి. 

రాముని దేవాలయాల పూజారులను సామాజిక దూరాలకు కట్టుబడి ఉండాలని, దేవాలయాల్లోకి అనుమతించవద్దని కోరారు. దేవాలయాల గేట్లు మూసివేయాలని, భక్తులు దేవాలయాలకు రాకుండా ఉండాలని కోల్‌కతా పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కొందరు భక్తులు పోలీసు సిబ్బందిపై దాడులకు కూడా దిగారు. 

వెస్ట్ మిడ్న్‌పూర్‌లోని గోల్టోర్ ప్రాంతంలో కొందరు పోలీసులపై దాడులు చేశారు. దేవాలయాలకు పోనివ్వకుండా అడ్డుకున్నారు అంటూ పోలీసులపై దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ జిల్లాల్లోని దేవాలయాల బయట కనిపించగా.. కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ రాములవారిని కోరినట్లు చెప్పారు.