Paperless Supreme Court
Digitization in Supreme Court : సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్ గా దిశగా మరో అడుగు వేసింది. పేపర్ లెస్ విధానం గ్రీన్ హైటెక్ విధానాన్ని అమలు చేయనుంది. మూడు కోర్టుల్లో పూర్తిగా పేపర్ లెస్ విధానాన్ని తీసుకురానుంది. కోర్టు హాల్లో కూడా గత 50 ఏళ్ల సుప్రీం కోర్టు తీర్పు కాపీలను తొలగించి..అన్ని ఫైళ్లను డిజిటల్ మాధ్యమాల ద్వారా చూసే వెలుసుబాటును కల్పించనుంది. దీని కోసం సుప్రీంకోర్టు లాబీల్లో వైఫై సదుపాయాన్ని కల్పించనుంది. సుప్రీంకోర్టు 73 ఏళ్ల న్యాయవ్యవస్థ చరిత్రలోనే పూర్తిగా పేపర్‌లెస్‌గా మారడం ఇదే తొలిసారి కావటం విశేషం.
సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్ దిశగా మరో ముందడుగు పడింది. నేటి నుంచి మూడు కోర్టులు పూర్తిగా పేపర్‌లెస్ గ్రీన్ హైటెక్ విధానాన్ని అమలు చేయనున్నాయి. 73 ఏళ్ల చరిత్రలో న్యాయవ్యవస్థలో పూర్తిగా పేపర్‌లెస్‌గా మారడం ఇదే తొలిసారి కావడం విశేషం.