CJI Chandrachud: విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ విద్యార్థుల మీద వివక్ష ఆగాలి.. సీజేఐ చంద్రచూడ్
ఇందుకు సంస్థాగత మార్పులు అవసరమని సీజేఐ సూచించారు. సానుభూతిని పెంపొందించడం విద్యాసంస్థలు తీసుకోవాల్సిన మొదటి అడుగు అని, సానుభూతిని పెంపొందించడం వల్ల శ్రేష్ఠత మరియు బహిష్కరణ సంస్కృతిని అంతం చేయవచ్చని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 75 సంవత్సరాల ప్రయాణంలో, తాము 'ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్' ఏర్పాటుపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.

Discrimination against Dalit, Adivasi communities should stop says CJI Chandrachud
CJI Chandrachud: విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ విద్యార్థులపై జరుగుతున్న వివక్షను ఆపాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా చంద్రచూడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, ఆదివాసీ విద్యార్థులను కించపరిచేలా బహిరంగంగా మార్కులు అడగడం, వారి ఇంగ్లీషు, శారీరక రూపాన్ని అవహేళన చేయడం మానుకోవాలని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.
Modi & Scholz: మోదీ కీలక ప్రకటన.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు భారత్ సిద్ధం
“కులాల వారీగా విభజనకు దారితీసే ప్రవేశ మార్కుల ఆధారంగా హాస్టళ్ల కేటాయింపు, సామాజిక వర్గాలతో పాటు మార్కుల పబ్లిక్ లిస్ట్ పెట్టడం, దళిత-ఆదివాసీ విద్యార్థులను కించపరిచేలా పబ్లిక్‌గా మార్కులు అడగడం, వారి ఇంగ్లీషును, శారీరక ఆకృతిని అపహాస్యం చేయడం, వారిని అసమర్థులుగా గుర్తించడం, వారిపై దుర్వినియోగాలకు పాల్పడటం, బెదిరింపుల సంఘటనలపై చర్య తీసుకోకపోవడం, సహాయక వ్యవస్థను అందించకపోవడం, వారి ఫెలోషిప్‌లను తగ్గించడం లేదా ఆపడం, జోకుల ద్వారా మూస పద్ధతులను సాధారణీకరించడం వంటి కొన్ని ప్రాథమిక అంశాలు ప్రతి విద్యా సంస్థ వెంటనే ఆపాలి” అని సిజెఐ చంద్రచూడ్ అన్నారు.
Kharge vs Amit Shah: అహంకారానికి పరాకాష్ట.. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ ఖర్గే
ఇందుకు సంస్థాగత మార్పులు అవసరమని సీజేఐ సూచించారు. సానుభూతిని పెంపొందించడం విద్యాసంస్థలు తీసుకోవాల్సిన మొదటి అడుగు అని, సానుభూతిని పెంపొందించడం వల్ల శ్రేష్ఠత మరియు బహిష్కరణ సంస్కృతిని అంతం చేయవచ్చని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 75 సంవత్సరాల ప్రయాణంలో, తాము ‘ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్’ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి అంశాలపై ఎందుకు మాట్లాడుతున్నారని ఒక వార్తా కథనంలో తాను చదివానని, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల నుండి దూరంగా ఉండలేరని, న్యాయపరమైన సంభాషణల సందర్భాలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమని ఆయన అన్నారు.
జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికాలో ఉద్భవించిన “బ్లాక్ లైవ్స్ మేటర్” ఉద్యమం గురించి కూడా సీజేఐ ప్రస్తావించారు. ‘‘వాషింగ్టన్ సుప్రీం కోర్టులో మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులు ఉంటారు. అమెరికాలో అత్యున్నత న్యాయస్థానమది. అమెరికాలో నల్లజాతి జీవితాల విలువ తగ్గింపు, అధోకరణంపై అక్కడి సుప్రీం కోర్టు.. న్యాయ సంఘాన్ని కలుపుకుని ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది. అదే విధంగా భారతదేశంలోని న్యాయమూర్తులు సమాజంతో కోర్టు గదుల లోపల, వెలుపల ప్రకటనలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.
Bengal: బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణ.. కేంద్ర మంత్రిపై రాళ్ల దాడి
“ప్రధాన న్యాయమూర్తిగా న్యాయపరమైన పనులు చూడడం, పరిపాలనా విధులే కాకుండా, మన సమాజాన్ని ప్రభావితం చేసే నిర్మాణాత్మక సమస్యలపై కూడా స్పందించడం, వాటి పరిష్కారానికి సహాయం అందించడమే నా ప్రయత్నం” అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థను పారదర్శకతకు ప్రతిరూపంగా మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఆయన నొక్కిచెప్పారు. షెడ్యూల్డ్ తెగల నుంచి 36 మంది లా గ్రాడ్యుయేట్‌లను కలిగి షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ పంపిన ప్రతిపాదనను ఆమోదించినట్లు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.